News July 12, 2024
గుంటూరు: ఆ స్టేషన్‌కు 5రోజుల్లో నలుగురు సీఐలు

గడిచిన 5రోజుల్లో నల్లపాడు పీఎస్‌కు నలుగురు CIలు మారారు. నల్లపాడు CIగా పనిచేస్తున్న నరేశ్ కుమార్ తొలుత సెలవుపై వెళ్లడంతో CI వెంకన్నచౌదరికి తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. మరుసటి రోజు నరేశ్ సెలవుల నుంచి వచ్చి విధుల్లో చేరగా, సాయంత్రానికి ఆయన్ను VRకి పంపారు. ఎస్సై సత్యనారాయణకు గురువారం ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. సాయంత్రానికి ఒంగోలు SEBలో చేస్తున్న వంశీధర్‌కు CIగా పూర్తి బాధ్యతలు అప్పజెప్పారు.
Similar News
News February 15, 2025
తెనాలి: కత్తితో దాడి.. వ్యక్తి మృతి

మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో తెనాలి నాజరుపేటకు చెందిన గొంది బసవయ్యపై ఇస్లాంపేటకు చెందిన జూపల్లి వేణు, అతని స్నేహితుడు రాము కత్తితో గొంతుపై దాడి చేసిన విషయం తెలిసిందే. గత నెల 31న ఈ ఘటన జరుగగా బసవయ్య తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. అప్పట్లో బాధితుడి ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. బాధితుడి మృతితో కేసును హత్య కేసుగా మార్చారు.
News February 15, 2025
GNT: మహిళల కోసం రూ. 4 కోట్లతో ప్లాటెడ్ ఫ్యాక్టరీ

స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామిక వేత్తలను చేసేందుకు ప్రభుత్వం ప్లాటెడ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుందని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ర్ టి. విజయలక్ష్మి అన్నారు. మంగళగిరి, దుగ్గిరాల మండలంలో రు.4 కోట్లతో ఫ్యాక్టరీ ఏర్పాటుకై స్థలం కోసం తహశీల్దార్‌తో మాట్లాడగా సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు. దుగ్గిరాల ఎంపీడీఓ కార్యాలయంలో పీడీ అధికారులతో మాట్లాడారు. ఎపీఎం సురేశ్ పాల్గొన్నారు.
News February 14, 2025
సంజీవయ్య జీవిత ప్రస్థానం స్ఫూర్తిదాయకం: సీఎం

నిజాయితీకి, నిరాడంబరత్వానికి, విలువలకు మారుపేరైన దామోదరం సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా ఉండవల్లిలో సీఎం చంద్రబాబు ఆయన చిత్రటానికి పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన సంజీవయ్య జీవిత ప్రస్థానం ఆద్యంతం స్ఫూర్తిదాయకం, ఆదర్శనీయమన్నారు. ఆ మహానుభావుడి జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం తెలుగుజాతికి గర్వకారణమని అన్నారు.