News June 2, 2024
గుంటూరు: ఇంజినీరింగ్ పనులు.. పలు రైళ్ల రద్దు

గుంటూరు-కేసీ కెనాల్ మధ్య ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున ఈనెల 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. విజయవాడ-గుంటూరు(07464), గుంటూరు-విజయవాడ (07465), గుంటూరు-విజయవాడ(07976), హుబ్బళి-విజయవాడ(17329) రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.
Similar News
News October 25, 2025
ఆ ఆసుపత్రులకు నోటీసులివ్వండి: కలెక్టర్

లక్ష్య సాధనలో అలసత్వం వద్దని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ శనివారం సమీక్ష నిర్వహించారు. గర్భిణీ స్త్రీల నమోదు మెరుగుపడాలని, ఏ.బి.హెచ్.ఏ పై అవగాహన కల్పించాలని, గ్రామ సచివాలయం సిబ్బందిని ఉపయోగించాలన్నారు. శత శాతం సిజేరియన్ ప్రసవాలు చేస్తున్న ఆసుపత్రులకు నోటీసులు జారీ చేయాలని, పక్కాగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
News October 25, 2025
నీటి పథకాలు సమర్థవంతంగా పనిచేయాలి : కలెక్టర్

నీటి పథకాల మరమ్మతులకు ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో శనివారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రతి నీటి పథకం సమర్ధవంతంగా పని చేయాలని, సి.పి.డబ్ల్యూ నీటి పథకాల మరమ్మతులకు ప్రతిపాదనలు జిల్లా పరిషత్ కు పంపించాలని సూచించారు. స్లో సాండ్ ఫిల్టర్లు ఏర్పాటుకు ప్రాధాన్యత మేరకు గుర్తించి అంచనాలు సమర్పించాలని ఆదేశించారు.
News October 25, 2025
తెనాలి అనగానే… ఆ పేరు చెప్పక తప్పదు

తెనాలి పట్టణం సాహిత్యం, సంగీతం, నాటకం, చిత్రకళ, శిల్పకళల కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రతిభావంతులైన కళాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గౌరవాలు అందుకుంటున్నారు. ప్రతి వీధిలోనూ సృజనాత్మకత ప్రతిధ్వనిస్తుంటే, కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు పట్టణానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. తెనాలి పేరు వినగానే “కళా కాణాచి” అనిపించుకోవడం ఆనవాయితీ.
@నేడు అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం


