News April 19, 2024

గుంటూరు: ఇంజినీరింగ్ పనులతో పలు రైళ్లు రద్దు

image

గుంటూరు-పగిడిపల్లి మార్గంలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున, ఈనెల 30వ తేదీన పలు రైళ్లు రద్దు చేసినట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. మరమ్మతుల వల్ల గుంటూరు-మాచర్ల, మాచర్ల- నడికుడి సికింద్రాబాద్-రేపల్లె రైళ్లు పూర్తిగా రద్దు చేసినట్లు తెలిపారు. లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ పగిడిపల్లి, కాజీపేట, కొండపల్లి, విజయవాడ మీదుగా మళ్లింపు మార్గంలో వెళ్తుందని తెలిపారు.

Similar News

News September 12, 2024

సీఎం చంద్రబాబుకు విరాళం అందించిన బాలకృష్ణ

image

సీఎం చంద్రబాబును గురువారం రాత్రి సచివాలయంలో కలిసిన ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ వరద బాధితుల సహాయార్థం రూ.50 లక్షల విరాళాన్ని అందించారు. ఆయనతోపాటు హీరోలు విశ్వక్సేన్, సిద్దు జొన్నలగడ్డ సైతం తమ వంతు సహాయంగా విరాళాల చెక్కులను సీఎంకు అందజేశారు. ఈ మేరకు సీఎం వారిని ప్రత్యేకంగా అభినందించారు.

News September 12, 2024

సీఎం చంద్రబాబుతో కేంద్ర బృందం భేటీ

image

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఊహించని విపత్తు తలెత్తి అపార నష్టాన్ని కలిగించిందని సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఆదుకునేందుకు ఉదారత చూపాలని సీఎం కోరారు. వరద నష్టాలపై అంచనాల కోసం ఏర్పాటైన కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించింది. అనంతరం గురువారం సచివాలయంలో వారు సీఎంతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని గుర్తించి ఉదారంగా సాయం చేయాలని సీఎం కోరారు.

News September 12, 2024

ఏచూరి సీతారాం మృతి పట్ల మంత్రి లోకేశ్ సంతాపం

image

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ గురువారం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఏచూరి మృతి తీవ్ర విషాదం నింపిందన్నారు. ‘ప్రజాపోరాట యోధుడిని కోల్పోయాం. ప్రజా ఉద్యమాలకే జీవితాన్ని అంకితం చేసిన ఆయనకు కన్నీటి నివాళులు అర్పిస్తున్నా.. అమర్ రహే కామ్రేడ్ సీతారాం ఏచూరి’ అంటూ ఆయన సంతాప సందేశంలో పేర్కొన్నారు.