News May 19, 2024
గుంటూరు: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు
భారతీయ వాయుసేనలో అగ్ని వీర్ వాయు సైనికుల ఉద్యోగం కొరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు, జిల్లా సైనిక సంక్షేమ అధికారిని గుణశీల శనివారం తెలిపారు. పదవ తరగతి తస్సమానమైన అర్హత కలిగి ఉండాలన్నారు. ఫ్లూట్, కీబోర్డ్, పీయానో ఏదైనా సంగీత ప్రావీణ్యత కలిగి ఉండాలన్నారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో ఆసక్తిగల యువకులు మే 22 నుంచి జూన్ 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
Similar News
News December 13, 2024
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి
అమరావతి: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో తీవ్రంగా వర్షాలు పడుతున్నాయని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. గురువారం అమరావతిలోని తన కార్యాలయం నుంచి ఆమె ప్రెస్ నోట్ విడుదల చేశారు. కొండ చరియలు విరిగిపడే ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. పోలీసు అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్ని రకాల ప్రభుత్వ శాఖల అధికారులను ఆదేశించారు.
News December 13, 2024
ప్రేమ్ కుమార్ అరెస్టు అక్రమం : వైఎస్ జగన్
గుంటూరుకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టు కొరిటిపాటి ప్రేమ్ కుమార్ కుటుంబ సభ్యులను గురువారం వైఎస్ జగన్ తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో కలిశారు. అరెస్టు జరిగిన విధానాన్ని విని అక్రమ అరెస్టును ఖండిస్తున్నానని, అతనికి కావలసిన న్యాయసహాయాన్ని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, నగర మేయర్ మనోహర్, మాజీ మంత్రి అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
News December 12, 2024
పేరేచర్ల: భార్యను చూడటానికి వెళ్తూ ప్రమాదం.. మృతి
మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పేరేచర్ల-నర్సరావుపేట మార్గంలో వాహనం అదుపు తప్పడంతో మరణించిన వ్యక్తి వివరాలను పోలీసులు సేకరించారు. మృతి చెందిన వ్యక్తి సంకురాత్రిపాడు గ్రామానికి చెందిన నన్నం విజయ్ కుమార్ (35) గా గుర్తించారు. గుంటూరులో హాస్పటల్‌లో ఉన్న తన భార్య చూడటానికి వెళ్తున్న క్రమంలో వాహనం అదుపుతప్పి వంతెనలోకి పడటంతో విజయ్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు.