News June 21, 2024
గుంటూరు: ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థుల దుర్మరణం

స్నేహితులతో సరదాగా తీరంలో గడిపేందుకు వచ్చి ముగ్గురు విద్యార్థులు మృతిచెందగా.. మరొక విద్యార్థి గల్లంతైన ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం తీరంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన నలుగురు యువకులు సరదాగా గడిపేందుకు శుక్రవారం రామాపురం సముద్ర తీరానికి వెళ్లారు. ఈ క్రమంలో అలల తాకిడి తీవ్రం కావడంతో నలుగురు యువకులు గల్లంతయ్యారు. కాసేపటికే మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి.
Similar News
News November 28, 2025
గుంటూరులో పోలీస్ సిబ్బంది గ్రీవెన్స్ డే

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పోలీస్ సిబ్బంది గ్రీవెన్స్ డేలో ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొన్నారు. మొత్తం 15 వినతులు స్వీకరించి, వ్యక్తిగత, సర్వీసు, బదిలీ, ఇతర పరిపాలనా సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు. సిబ్బంది సంక్షేమం పోలీస్ శాఖకు ప్రాధాన్యం అని, భయపడకుండా సమస్యలను నేరుగా తెలియజేయాలని ఆయన సూచించారు.
News November 28, 2025
దుగ్గిరాల యార్డులో క్వింటాల్ పసుపు ధర ఎంతంటే.!

దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో శుక్రవారం నిర్వహించిన వేలంలో 140 బస్తాల పసుపు విక్రయాలు జరిగాయి. ఈ వేలంలో క్వింటాల్ పసుపు ధర రూ.12,900 పలికింది. కొమ్ముల రకం పసుపు కనిష్ఠ, గరిష్ఠ, మోడల్ ధరలు రూ.12,900గా ఒకే ధర పలకగా, కాయ రకం పసుపు కూడా అదే ధర పలికినట్లు యార్డు అధికారులు తెలిపారు.
News November 28, 2025
ఖేలో ఇండియా క్రీడల్లో ANU విద్యార్థికి మూడో స్థానం

రాజస్థాన్లోని బికనీర్లో జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడా పోటీలలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) విద్యార్థి ఎం. అశోక్ కుమార్ శుక్రవారం మూడో స్థానం సాధించారు. వెయిట్ లిఫ్టింగ్ 94 కేజీల కేటగిరీలో ఆయన కాంస్యం గెలుచుకున్నారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ను వర్సిటీ వీసీ గంగాధరరావు, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.


