News August 11, 2024
గుంటూరు: ఈ రైళ్లు ఆలస్యం
గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున కొన్ని రైళ్లు ఆలస్యంగా, మరికొన్నింటిని మళ్లించినట్టు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈ నెల 13, 14 తేదీల్లో రేపల్లె-సికింద్రాబాద్ రైలు (17646) 240 నిమిషాలు, 12, 13, 14 తేదీల్లో సికింద్రాబాద్- త్రివేండ్రం (17230) 75 నిమిషాలు, ఈనెల 12, 13 తేదీల్లో విశాఖపట్నం- లింగంపల్లి (12805) 45 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమవుతాయన్నారు.
Similar News
News September 11, 2024
నేడు గుంటూరుకు జగన్ రాక
వైసీపీ అధినేత జగన్ బుధవారం గుంటూరులో పర్యటిస్తారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి 11 గంటలకు గుంటూరు సబ్ జైలుకు చేరుకుంటారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్‌తో ములాఖత్ అవుతారు. 11.30 గంటలకు జైలు నుంచి బయల్దేరి ఎస్వీఎన్ కాలనీలో టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ ఈదా సాంబిరెడ్డిని పరామర్శిస్తారు. 11.55కి ఎస్వీఎన్ కాలనీ నుంచి తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.
News September 11, 2024
అమరావతి రైతుల సాయం రూ.3.31లక్షలు
వరద బాధితులకు అమరావతి పరిధిలోని 29 గ్రామాల రైతులు అండగా నిలిచారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.3.30 లక్షలు అందజేశారు. సంబంధిత చెక్‌ను సీఎం చంద్రబాబుకు విజయవాడలో అందజేశారు. రైతులను సీఎం చంద్రబాబు అభినందించారు. కార్యక్రమంలో రైతులు చిట్టిబాబు, శ్రీధర్, రవి, అనిల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
News September 10, 2024
ఇండియా-ఏ జట్టులోకి గుంటూరు కుర్రాడు
గుంటూరు కుర్రాడికి ఇండియా టీంలో చోటు దక్కింది. దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఏ జట్టుకు జురెల్ స్థానంలో షేక్ రషీద్‌ను ఎంపిక చేశారు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రషీద్ ఎంపికైన విషయం తెలిసిందే. ఇండియా అండర్-19 జట్టుకూ ప్రాతినిధ్యం వహించాడు. ఈ 19ఏళ్ల గుంటూరు కుర్రాడు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేస్తాడు.