News September 9, 2024

గుంటూరు: ఉద్యోగినితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న కానిస్టేబుల్ సస్పెండ్

image

ఓ ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పట్టాభిపురం పీఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ హనుమంతురావు కోర్టులో పనిచేసే ఉద్యోగినికి అసభ్యకర పోస్టులు పెడుతూ వేధిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆమె పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన అనంతరం, నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేశారు.

Similar News

News October 13, 2024

గత ప్రభుత్వం నాపై అక్రమ కేసులు పెట్టింది: ధూళిపాళ్ల

image

గత ప్రభుత్వం తనపై అక్రమ కేసులు పెట్టిందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. గుంటూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంబటి మురళీకృష్ణ తనపై బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. గ్రీన్ గ్రేస్ అపార్టుమెంట్ల నిర్మాణంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. అధికారం అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఆ అక్రమాలను నిరూపించటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

News October 12, 2024

గుంటూరు: దసరా.. మీ VILLAGE స్పెషల్ ఏంటి.?

image

దసరా పండుగ అనగానే అందరికీ పల్లెటూరు గుర్తుకు వచ్చేస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్నవారు తిరిగి సొంతూరుకు రావడం, బంధువులు, స్నేహితులు కలిసి ఊరంతా సంతోషంగా తిరుగుతూ ఉంటారు. ఊరిలో అందరినీ పలకరిస్తూ.. ఉంటే ఆ ఆనందం మాట్లల్లో చెప్పలేని సంతోషాన్ని ఇస్తుంది. ప్రతి ఊరితో ఒక్కో విధంగా పండుగను జరుపుకుంటారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.

News October 12, 2024

తెలుగుజాతి ఎప్పటికీ మరిచిపోలేని పేరు ఎన్టీఆర్: జీవీ ఆంజనేయులు

image

చరిత్ర ఉన్నంత కాలం తెలుగుజాతి ఎప్పటికీ మరిచిపోలేని పేరు ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. శనివారం వినుకొండ సురేష్ మహల్ రహదారిలో ఆర్చ్ నిర్మాణానికి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నటుడిగా, ముఖ్యమంత్రిగా, అంతకు మించిన మహనీయుడిగా తెలుగువారి గుండెల్లో అంతగా చెరగని ముద్రవేశారని కొనియాడారు.