News March 19, 2024
గుంటూరు: ఎన్నికల షెడ్యూల్ దృష్ట్యా రైతులకు విజ్ఞప్తి

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారి సోమవారం ఒక ప్రకటన ద్వారా రైతులకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కోడ్ సమయంలో ఆధారం లేకుండా అధిక మొత్తంలో నగదును తీసుకొని వెళ్లడం నేరం. మిర్చి యార్డులో మిర్చి అమ్ముకొని నగదు తీసుకొని వెళ్లేటప్పుడు రైతు సోదరులు నగదుకు సంబంధించిన రసీదును తప్పనిసరిగా తీసుకువెళ్లాలన్నారు. ఆ రసీదు మీకు ఆధారంగా ఉపయోగపడుతుందన్నారు.
Similar News
News April 4, 2025
మాచర్ల నియోజకవర్గంలో ఒకరి హత్య

ఉమ్మడి గుంటూరు జిల్లా మాచర్ల పరిధిలో హరిచంద్ర హత్యకు గురయ్యాడు. శుక్రవారం ఆయన మృతదేహం పొలంలో ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. కాగా రెండు రోజుల క్రితం నాగార్జున సాగర్ హిల్ కాలనీలో హరిచంద్ర కిడ్నాప్‌కు గురయ్యారు. రెండు రోజుల తర్వాత ఆయన శవమై కనిపించారు. పోలీసులు తమకు అందిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించారు. హత్యకు కుటుంబ కలహాలు కారణమా? రాజకీయా కోణమా? అనేది దర్యాప్తు చేస్తున్నారు
News April 4, 2025
GNT: బాలిక మృతి కేసు.. స్పెషల్ వైద్య బృందం దర్యాప్తు

నరసరావుపేటలో బాలిక మృతి కేసును దర్యాప్తు చేయడానికి ప్రత్యేక వైద్య బృందం గురువారం మంగళగిరి ఎయిమ్స్‌లో సమావేశమైంది. ఈ బృందంలో ఢిల్లీ, ముంబయి నుంచి వచ్చిన నిపుణులు ఉన్నారు. వారు మృత బాలిక రక్త నమూనాలపై సమగ్ర సమాచారం సేకరించారు. అనంతరం దర్యాప్తు కొనసాగించేందుకు గుంటూరు వైద్య కళాశాలకు బయలుదేరి వెళ్లారు. ఈ బృందంలో వెటర్నరీ డాక్టర్ సహా మొత్తం ఐదుగురు డాక్టర్లు ఉన్నారు.
News April 4, 2025
GNT: రైల్వే ట్రాక్‌ల వెంట యాంట్రీ-క్రాష్ బ్యారియర్ ఏర్పాటు

రైల్వేట్రాక్‌లపై అనధికార ప్రవేశం, పశువుల సంచారాన్ని అడ్డుకునేందుకు రైల్వే బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టింది. మొదటగా తెనాలి-గుంటూరు సెక్షన్‌లో ఈ యాంట్రీ-క్రాష్ బ్యారియర్ / డబ్ల్యూ-బీమ్ స్టీల్ ఫెన్సింగ్ పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. గుంటూరు రైల్వే డివిజన్ టెండర్లు పిలిచి, ఏడాది లోపు ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ నిర్మాణానికి రూ.13.76 కోట్లు వ్యయం కానుంది.