News November 11, 2024

గుంటూరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గొంతు వినిపిస్తారా?

image

నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు ఉమ్మడి గుంటూరు ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఎన్నికలు జరిగాక తొలి బడ్జెట్ సమావేశం కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎన్నికలకు ముందు రోడ్ల సమస్యలు, తోటపల్లి ఎత్తిపోతల పథకం కాలువ పనులు, యువతకు ఉద్యోగ కల్పన తదితర అంశాలపై ప్రస్తుతం ఎన్నికైన ఎమ్మెల్యేలు హామీలు ఇచ్చారు. మరి వీటి అమలుకు నిధులు వచ్చేలా అసెంబ్లీలో చర్చిస్తారా? లేదా? అనేది వేచి చూడాలి.

Similar News

News December 8, 2024

LLB ప్రవేశాలకు 9న స్పాట్ అడ్మిషన్లు

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర విభాగానికి సంబంధించి ఈ నెల 9న సోమవారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. వివరాలను యూనివర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ పి.బ్రహ్మజీరావు తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన వారు నేరుగా అడ్మిషన్ కార్యాలయానికి వచ్చి ప్రవేశాలు పొందవచ్చు అన్నారు. లా సెట్ రాయని వారికి కూడా ఈ ప్రవేశాల్లో అర్హులన్నారు.

News December 8, 2024

గుంటూరు: నర్సింగ్ విద్యార్థినులకు జర్మనీలో ఉద్యోగాలు

image

నర్సింగ్ విద్యార్థులకు జర్మనీలో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు తెలిపారు. G.N.M, B.S.C నర్సింగ్ విద్యార్హత కలిగిన 35 ఏళ్ల లోపు వారు ఈ నెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. గుంటూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో శిక్షణ అనంతరం జర్మనీలో ఉద్యోగం కల్పిస్తున్నట్లు తెలిపారు. https://forms.gle/K3He7nxcKE5HTacu8 లింకులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనివివరించారు

News December 8, 2024

తాడేపల్లి: మద్యం మత్తులో తన ఇంటినే తగలబెట్టుకున్న వ్యక్తి

image

మద్యం మత్తులో ఓ వ్యక్తి తన ఇంటినే తగులబెట్టుకున్న ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నులకపేట రామయ్య కాలనీకి చెందిన బడేబాబు తన భార్యతో గొడవ పడ్డాడు. అనంతరం భార్యా పిల్లల్ని బయటకు నెట్టేసి తన ఇంటికి నిప్పు పెట్టుకున్నాడు. స్థానికులు బడేబాబును బలవంతంగా బయటకు తెచ్చి ప్రాణాలు కాపాడారు. కాగా ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతయింది.