News March 4, 2025
గుంటూరు: ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సాగిందిలా..

ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు మొదటి నుండి 9వ రౌండ్ వరకు వచ్చిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి రౌండ్-17,194, 2వ-15,627, 3వ-16,722, 4వ-16,236, 5వ-16,916 6వ-17,028, 7వ-16,447 8వ-16,900 9వ రౌండ్-10,087 చొప్పున మొత్తం 1,45,057ఓట్లు వచ్చాయి. అలాగే లక్ష్మణరావుకు మొదటి రౌండ్-7,214, 2వ-6,742, 3వ-7,404, 4వ-7,828, 5వ-7,535, 6వ-6,844, 7వ-7,251, 8వ-7,201, 9వ రౌండ్-4,718 చొప్పున మొత్తం 62,737 ఓట్లు వచ్చాయి
Similar News
News November 13, 2025
GNT: పేకాట ఆడిన పోలీసుల్ని సస్పెండ్ చేసిన ఎస్పీ

పేకాట ఆడుతూ పట్టుబడిన పోలీసులను గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ సస్పెండ్ చేశారు. పెదకాకాని ఏఎస్ఐ వెంకట్రావు, గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రాధాకృష్ణ, తుళ్లూరు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రాజేంద్రప్రసాద్ గత కొద్దిరోజుల క్రితం ఓ హోటల్లో పేకాట ఆడారని చెప్పారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ ఉల్లంఘించడంతో వారిని సస్పెండ్ చేశామని ఎస్పీ తెలిపారు.
News November 12, 2025
GNT: జిల్లాలో అదనంగా 264 పోలింగ్ కేంద్రాలు

గుంటూరు జిల్లాలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ద్వారా అదనంగా 264 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే ఖాజావలి తెలిపారు. కలెక్టరేట్ వీసీ హాలులో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అదనంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
News November 12, 2025
న్యూమోనియా రహిత సమాజ నిర్మాణం లక్ష్యం: కలెక్టర్

న్యూమోనియా వ్యాధి రహిత సమాజ నిర్మాణం లక్ష్యమని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. న్యూమోనియా వ్యాధిపై అవగాహన పోస్టర్లను బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఆమె విడుదల చేశారు. ప్రతీ సంవత్సరం నవంబర్ 12వ తేదిన ప్రపంచ న్యూమోనియా దినోత్సవం నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఊపిరితిత్తులలో అసాధారణ ద్రవం చేరడం వల్ల శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిని కల్గించే పరిస్థితిని న్యూమోనియా అన్నారు.


