News September 4, 2024

గుంటూరు: ఏపీ అలర్ట్‌తో 7.49 కోట్ల మందికి హెచ్చరిక

image

రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల సమయంలో ఏపీ అలెర్ట్ ద్వారా 7.49 కోట్ల మంది వినియోగదారులకు హెచ్చరిక సందేశాలు అందించామని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. 149 పశువులు 59,848 కోళ్లు మరణించాయన్నారు. 12 విద్యుత్ సబ్స్టేషన్లు దెబ్బతిన్నాయని, అధిక వర్షాల కారణంగా 2851 కిలోమీటర్ల పొడవున ఆర్‌అండ్‌బి రోడ్లు దెబ్బతిన్నాయని పేర్కొంది.

Similar News

News September 14, 2025

గుంటూరులో కేజీ చికెన్ ధర ఎంతంటే.?

image

గుంటూరు శ్రీరామ్ నగర్‌లో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ. 220, స్కిన్ కేజీ రూ.200గా అమ్ముతున్నారు. కొరమేను చేపలు కేజీ రూ.450, రాగండి రూ. 180, బొచ్చెలు రూ. 220, మటన్ రూ.950గా విక్రయిస్తున్నారు. నగరంలోని చుట్టుపక్కల అన్ని ప్రాంతాలలో రూ. 20 నుంచి రూ. 50ల వరకు ధరల్లో వ్యత్యాసం ఉంది.

News September 14, 2025

GNT: నేడు ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్న వకుల్ జిందాల్

image

గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా వకుల్ జిందాల్ ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 10.30 గంటలకు డీపీఓలోని ఎస్పీ ఛాంబర్‌లో ఆయన బాధ్యతలు తీసుకుంటారు. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన విజయనగరం నుంచి గుంటూరుకు బదిలీ అయ్యారు. ఎస్పీ బాధ్యతల స్వీకరణ కోసం పరిపాలనా సిబ్బంది ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

News September 14, 2025

గుంటూరు జిల్లాలో దంచికొట్టిన వర్షం

image

గుంటూరు జిల్లాలో శనివారం వర్షం దంచికొట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. మధ్యాహ్నం మొదలైన వర్షం పలు ప్రాంతాల్లో రాత్రి వరకు కురుస్తూనే ఉంది. వర్షంతో పాటు పిడుగులు, ఈదురుగాలులు కూడా వీయడంతో ప్రజలు అసౌకర్యం వ్యక్తం చేశారు. పిడుగులు పడి పెదనందిపాడు మండలంలో ఇద్దరు, పెదకాకాని మండలంలో మరో ఇద్దరు మహిళా కూలీలు మృత్యువాత పడ్డారు. పలు చోట్ల అధిక వర్షం కారణంగా కాలువలు నిండి నీరు రోడ్లపైకి చేరింది.