News November 10, 2024
గుంటూరు: ఐదవ సారి రక్తదానం చేసిన శ్రీనివాస్

విజయవాడలోని ఓ హాస్పిటల్లో ఆపరేషన్ సమయంలో ఓ పేషెంట్కు రక్తం తక్కువగా ఉండటంతో 0+ బ్లడ్ కావాలని డాక్టర్ సూచించారు. కుటుంబసభ్యులు వెంటనే పొన్నూరుకు చెందిన ‘పొన్నూరు బ్లడ్వెల్ఫేర్ అసోసియేషన్’ సంస్థను సంప్రదించారు. దీంతో సంస్థ సభ్యుడు శ్రీనివాస్ స్పందించి 5వ సారి రక్తదానం చేశారు. అత్యవసర సమయంలో ఆదుకున్న శ్రీనివాసుకు పేషంట్ బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News October 14, 2025
యుద్ధ విన్యాసాలు చేస్తూ గుంటూరు సైనికుడు మృతి

రాజస్థాన్లోని సైనిక స్థావరంలో యుద్ధ విన్యాసాలు చేస్తూ గుంటూరు సంగడిగుంటకు చెందిన తేజ్ భరద్వాజ్ మరణించారు. దేశ సేవపై మక్కువతో సైన్యంలో చేరిన భరద్వాజ్ ప్రమాదవశాత్తు మరణించడం సైన్యం, కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహం ఇవాళ సాయంత్రానికి సంగడిగుంటలోని నివాసానికి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.
News October 14, 2025
తెనాలి: రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్

తెనాలి చెంచుపేటలో సంచలనం రేకెత్తించిన జూటూరి తిరుపతిరావు హత్య కేసు నిందితుని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దింపారు. మృతుని స్వగ్రామం కోడితాడిపర్రులో సొసైటీ దేవాలయానికి సంబంధిన వ్యవహారంలో విభేదాల కారణంగా హత్య జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మృతదేహానికి ఘటనా స్థలంలోనే పంచనామా నిర్వహిస్తున్నారు.
News October 14, 2025
GNT: సైబర్ నేరాలకు పాల్పడుతున్న వంటమాస్టర్ అరెస్ట్ !

గుంటూరు ఎస్వీఎన్ కాలనీకి చెందిన రైస్ మిల్లు యజమాని వెంకటేశ్వరరావు ఖాతా నుంచి రూ. కోటి కొల్లగొట్టిన సైబర్ నేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకొల్లుకు చెందిన నిందితుడు ఇంటర్ చదివి బెంగుళూరులో వంటమాస్టర్గా పనిచేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. అలా కొల్లగొట్టిన డబ్బును అతని స్నేహితులు ఖాతాలకు మళ్లించడంతో పాటూ క్రికెట్ బెట్టింగ్ కోసం వినియోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.