News March 13, 2025
గుంటూరు కమిషనర్ ఆదేశాలు

GMCకి ఆస్తి పన్ను చెల్లించని మొండి బకాయిదార్లు గృహాల, వ్యాపార సంస్థల ట్యాప్ కనెక్షన్‌లు తొలగించుట, ఆస్తులను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు బుధవారం సీజ్ చేయాలన్నారు. బుధవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఆస్తి పన్ను వసూళ్ళ పై రెవిన్యూ విభాగం, విభాగాధిపతులతో సమీక్షా సమావేశం జరిగింది. వారు మాట్లాడుతూ.. గుంటూరులో 3 ఏళ్ల కు పైగా ఆస్తి పన్ను బకాయి ఉన్న వారి నివాసాలకు సీజు చేయమని ఆదేశించారు.
Similar News
News March 27, 2025
గుంటూరు: సీఎం చంద్రబాబుకు నాదెండ్ల స్వాగతం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను గురువారం పరిశీలన చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ పోలవరం చేరుకుని ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి మంత్రి నాదెండ్ల ప్రాజెక్టు గురించి పలు విషయాలు వివరించారు. అనంతరం నిర్వాశితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.
News March 27, 2025
ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

మాజీ మంత్రి విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను ఏప్రిల్ 2వ తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. కాగా ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌కు మాజీ మంత్రి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
News March 27, 2025
గుంటూరు జిల్లా సర్వసభ్య సమావేశం వాయిదా

ఈనెల 29వ తేదీన గుంటూరులో జరగనున్న ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదా వేసినట్లు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ కత్తెర హెన్రీ క్రిస్టినా బుధవారం తెలిపారు. 2025-26వ సంవత్సర బడ్జెట్‌లో ప్రభుత్వ పథకాలను అదనంగా చేర్చ వలసి ఉన్నందున అదే విధంగా మెజార్టీ సభ్యులు కొంత సమయం కోరిన కారణంగా వాయిదా వేసినట్లు ఛైర్‌పర్సన్ తెలిపారు.