News December 7, 2024
గుంటూరు: కలెక్టర్ల సమావేశానికి ఏర్పాట్లు పరిశీలన
ఈనెల 10,11 తేదీలలో వెలగపూడి సచివాలయం వద్ద జరిగే జిల్లా కలెక్టర్ల సమావేశానికి సంబంధించి ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం కలెక్టర్ నాగలక్ష్మీ పరిశీలించారు. సీటింగ్ ఏర్పాట్లు, అకామడేషన్ ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. వెహికల్ పార్కింగ్, సెక్యూరిటీ, భోజన ఏర్పాట్ల గురించి ఆమె స్థానిక అధికారులతో మాట్లాడారు. డ్యూటీలు కేటాయించిన అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ చెప్పారు.
Similar News
News January 14, 2025
రేపు గుంటూరు రానున్న బాబీ, తమన్
గుంటూరు ఐటీసీ హోటల్ నుంచి మైత్రి మూవీస్ వరకు బుధవారం ఉదయం 10.30 గంటలకు జరగనున్న బైక్ ర్యాలీలో డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాల్గొంటారని గుంటూరు బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యుడు బెల్లంకొండ సురేశ్ మంగళవారం తెలిపాడు. అనంతరం బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాను అభిమానులతో బాబీ, తమన్, డిస్టిబూటర్స్ చూడనున్నారని తెలిపారు. ఈ ర్యాలీని బాలయ్య అభిమానులు విజయవంతం చేయాలని కోరారు.
News January 14, 2025
చేనేతలపై అభిమానాన్ని చాటుకున్న మంత్రి లోకేశ్
చేనేతలపై అభిమానాన్ని మంత్రి లోకేశ్ మాటల్లో కాకుండా చేతల్లో చూపుతున్నారు. సంక్రాంతి పండుగ వేడుకల కోసం కుటుంబంతో సహా నారావారిపల్లె వెళ్లిన లోకేశ్, భార్య బ్రహ్మణికి మంగళగిరి చేనేత చీరను స్పెషల్ గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ఫ్రైజ్ చేశారు. బ్రహ్మణి సంక్రాంతి రోజున మంగళగిరి చీర కట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అవకాశం ఉన్న ప్రతిచోట భార్య బ్రహ్మణి మంగళగిరి చేనేతను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు.
News January 14, 2025
రాష్ట్రస్థాయి పోటీల్లో పల్నాడు వాసులు విజయం
సంక్రాతి పండుగ సందర్భంగా ఆత్రేయపురంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పడవల పోటీల్లో పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం రామాపురం గ్రామ పల్లెకారులు విజయం సాధించారు. సంక్రాంతి సందర్భంగా ప్రతి ఏటా గోదావరి జిల్లాల్లో పడవల పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ పోటీలో పాల్గొన్న రామాపురం మత్స్యకారులు ప్రతిభ కనబరిచి విజయం సాధించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.