News March 12, 2025
గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ సూచనలు

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ హెచ్చరించారు. సచివాలయాలకు వచ్చే ప్రజలను గౌరవించి మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, సచివాలయంలో ఇచ్చే అప్లికేషన్లో ఎటువంటి రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, గుర్తులు ఉన్నవి వాడటానికి వీలులేదని స్పష్టం చేశారు.
Similar News
News March 16, 2025
ఉండవల్లి: హడ్కో- సీఆర్డీఏ మధ్య ఒప్పందం

ఉండవల్లి నివాసంలో ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో హడ్కో-సీఆర్డీఏ మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం మేరకు రాజధాని నిర్మాణాలకు హడ్కో రూ.11వేల కోట్లు రుణంగా అందించనుంది. జనవరి 22న ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధులు మంజూరుకు అంగీకారం తెలిపారు. కార్యక్రమంలో మంత్రి నారాయణ, హడ్కో సీఎండీ సంజయ్ కుల్ శ్రేష్ఠ, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
News March 16, 2025
GNT: మేయర్ ఆకస్మిక నిర్ణయంపై వైసీపీలో అసంతృప్తి

మేయర్ మనోహర్ రాజీనామా నిర్ణయంపై వైసీపీలో కూడా కొంత అసంతృప్తికి దారితీసినట్లు సమాచారం. వైసీపీకి ఉన్న 23 మంది కార్పొరేటర్లతో ఆయన మాట మాత్రం చెప్పకుండా నిర్ణయం తీసుకున్నారని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు వ్యాఖ్యానించారు. పార్టీ జిల్లా నగర అధ్యక్షులకు కూడా సమాచారం ఇవ్వలేదని సమాచారం. టీడీపీ అవిశ్వాసం పెట్టడానికి ముందే మేయర్ రాజీనామా చేయడంతో తదుపరి చర్యలపై ఆ పార్టీ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు.
News March 16, 2025
రేపటి నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం

ఇంటర్ ప్రథమ, 2వ సంవత్సరం విద్యార్థులకు ప్రధాన పరీక్షలు శనివారంతో ముగిశాయి. గురువారంతో ఇంటర్ ప్రథమ సంవత్సరం, శనివారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ముగిశాయి. చివరి రోజు పరీక్షలకు జనరల్, ఒకేషనల్ విద్యార్థులు కలిపి 29,405 మందికి 28,901 మంది హాజరు కాగా 503 మంది గైర్హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారం నుంచి జరగనుంది. ఇందుకోసం సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళ కాలేజీలో ఏర్పాట్లు చేశారు.