News January 2, 2025

గుంటూరు: కానిస్టేబుల్ అభ్యర్థుల పరుగు పోటీలలో 166 మంది అర్హత

image

పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు గుంటూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో పరుగు పోటీలు నిర్వహించారు. గురువారం నిర్వహించిన పోటీలలో 246 మంది అభ్యర్థులు హాజరవగా దేహదారుఢ్య, పరుగు పోటీలలో 166 మంది అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు. పోటీల నిర్వహణ తీరును జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు. ఏఎస్పీలు సుప్రజ, హనుమంతరావు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Similar News

News January 18, 2025

NTRకు భారతరత్న ఇచ్చేలా కేంద్రంతో చర్చలు:  లోకేశ్ 

image

రాజకీయాల్లోకి వచ్చిన 9నెలల్లో ప్రభంజనం సృష్టించి టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఎన్టీఆర్ 29వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్‌లో తల్లి భువనేశ్వరితో కలిసి లోకేశ్ నివాళులర్పించారు. ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు తలెత్తుకు తిరిగేలా చేశారని కొనియాడారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు.

News January 18, 2025

గుంటూరులో ఇద్దరు డీఎస్పీలు బదిలీ

image

గుంటూరు వెస్ట్, సౌత్ డీఎస్పీలు జయరామ్ ప్రసాద్, మల్లికార్జునరావును ప్రభుత్వం బదిలీ చేసింది. గతేడాది బోరుగడ్డ అనిల్ కుమార్ అరండల్‌పేట స్టేషన్‌లో ఉన్నప్పుడు దిండు, దుప్పట్లు ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులను కలిసి రాచమర్యాదలు చేశారనే దానిపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇదిలా ఉంటే బదిలీతో ఖాళీ అయిన స్థానాలను భానోదయ, అరవింద్‌తో ప్రభుత్వం భర్తీ చేసింది.

News January 18, 2025

గుంటూరులో ముగ్గురికి జీవిత ఖైదు

image

గుంటూరు బార్ అసోసియేషన్ మహిళా న్యాయవాది హత్య కేసులో ముగ్గురు ముద్దాయిలకు జీవిత ఖైదు విధించారు. లక్ష చొప్పున జరిమానా, బాధితురాలి పరిహారం కింద రూ.1,50,000 విధిస్తూ గుంటూరు 5వ అదనపు జడ్జి తీర్పు వెలువరించారు. గుంటూరు బ్రాడీపేటకు చెందిన న్యాయవాది రాచబత్తుని సీతా మహాలక్ష్మిని 2014లో సుబ్బారావు, శ్రీవాణి, మేరీజ్యోతి అనే ముగ్గురు కలిసి హత్య చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష విధించారు.