News April 18, 2024

గుంటూరు: కాలువలో మృతదేహం 

image

జిల్లాలోని నగరం మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని అఖిలేరు కాలవలో 30 నుంచి 40 సంవత్సరాల మధ్య గల గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. ఎస్సై కోటేశ్వరరావు తెలిపిన వివరాలు.. మృతుడు 5.5 అడుగుల ఎత్తు, ఫ్రెంచ్ గడ్డం, సిమెంట్ కలర్ కాటన్ ప్యాంట్, ఎరుపు, నలుపు రంగు చెక్స్ చొక్కా, నలుపు రంగు బెల్ట్ ధరించి, గోల్డ్ కలర్ బకిల్ కలిగి ఉందన్నారు. ఆచూకీ తెలిసిన వారు స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.  

Similar News

News September 13, 2024

యాత్రికుల రక్షణకు చర్యలు ప్రారంభించాం: మంత్రి లోకేశ్

image

కేదార్ నాథ్‍లో చిక్కుకున్న 18 మంది తెలుగు యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం, మంత్రి మాట్లాడుతూ స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని, ఈ లోగా యాత్రికులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వ సహకారాన్ని కోరామన్నారు. యాత్రికులు, వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలన్నారు.

News September 13, 2024

గుంటూరు: విద్యార్థులకు శుభవార్త చెప్పిన RBI

image

RBI 90వ వార్షికంలోకి అడుగుపెట్టిన సందర్భంగా డిగ్రీ విద్యార్థులకు RBI-90పేరిట క్విజ్ పోటీలు నిర్వహించనుంది. గుంటూరు జిల్లాలోని అన్ని కాలేజీలలో18వేల మంది ఉన్నారు. పాల్గొనే వారు 2024 sep 1కి 25 ఏళ్లలోపు ఉండి, WWW.rbi90quiz.inలో ఈ నెల 17 లోపు అప్లై చేసుకోవాలి. పోటీలు ఈనెల 19-21తేదీ వరకు ఉ.9- రాత్రి 9వరకు జరగనున్నాయి. జాతీయ స్థాయి విజేతలకు వరుసగా రూ.10లక్షలు,రూ. 8లక్షలు, రూ.6 లక్షలు నగదు ఇవ్వనున్నారు.

News September 13, 2024

గుంటూరు: రాష్ట్ర అధికార ప్రతినిధిగా మస్తాన్ వలీ

image

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా గుంటూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ నియమితులయ్యారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మన రాష్ట్రానికి చెందిన 9 మంది కాంగ్రెస్ నాయకులను రాష్ట్ర అధికార ప్రతినిధిలుగా నియమించింది. ఇందులో మస్తాన్ వలీకి కూడా స్థానం దక్కింది. దీంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వలీకి శుభాకాంక్షలు తెలిపారు.