News June 2, 2024

గుంటూరు: కౌంటింగ్ సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు

image

జూన్ 4న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కౌంటింగ్ సందర్భంగా ట్రాఫిక్ మల్లింపు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తుషార్ ఆదివారం తెలిపారు. గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్ళు వాహనాలు బుడంపాడు జంక్షన్, తెనాలి, వేమూరు, పెనుమూడి బ్రిడ్జి మీదుగా ప్రయాణించాలన్నారు. నాలుగో తేదీ కౌంటింగ్ ముగిసే వరకు మళ్లింపు ఉంటుందన్నారు. వాహనదారు సహకరించాలన్నారు.

Similar News

News September 19, 2024

హామీలు కార్యరూపం దాలుస్తున్నాయి: లోకేశ్

image

యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా కార్యరూపం దాలుస్తున్నాయని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మాజీ సైనికులు యువగళం పాదయాత్ర సందర్భంగా తనకు వినతిపత్రం సమర్పించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆ హామీ నెరవేరుస్తూ ఈ రోజు క్యాబినెట్ సమావేశంలో తీర్మానం చేశామని xలో లోకేశ్ తెలిపారు.

News September 18, 2024

రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

ఎన్టీఆర్ వైద్య సేవా పథకం క్రింద పని చేసే నెట్వర్క్ ఆసుపత్రులలో పేద రోగుల నుంచి డబ్బులు వసులు చేసినట్లు రుజువు ఐతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ పి. అరుణ్ బాబు హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా క్రమశిక్షణ సంఘం సమావేశం నిర్వహించారు. కొన్ని ఆసుపత్రులలో రోగనిర్ధారణ నిమిత్తం డా. ఎన్టీఆర్ వైద్య సేవ లబ్దిదారులైన రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని అన్నారు.

News September 18, 2024

రేపు మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం

image

ఏపీలో మరో 75 అన్న క్యాంటీన్లు గురువారం ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రెండో విడత క్యాంటీన్‌ల ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించగా, రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.