News March 10, 2025
గుంటూరు: క్వశ్చన్ పేపర్ లీక్.. తీగలాగితే డొంక కదిలింది

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఈడీ ప్రశ్నా పత్రాల లీకేజీ విషయంలో 9 మంది ఏజెంట్లతో పాటూ వినుకొండలో ఓ కళాశాలకు చెందిన ఛైర్మన్, కంప్యూటర్ ఆపరేటర్ కీలకపాత్ర పోషించారు. ANU ఈ మేరకు తెనాలిలో ఓ వ్యక్తిని విచారించగా సామాజిక మాధ్యమం ద్వారా ప్రశ్నాపత్రం తనకు వచ్చిందని అన్నారు. ఆ తర్వాత లోతుగా దర్యాప్తు చేపట్టగా ప్రశ్నాపత్రం వినుకొండ నుంచి అందరికీ ఫార్వర్డ్ అయినట్లు నిర్ధారించుకున్నారు.
Similar News
News September 18, 2025
జూబ్లీ బైపోల్.. ఢిల్లీలో పైరవీలు!

TG: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ కోసం ఢిల్లీలో భారీ లాబీయింగ్ జరుగుతోంది. ముఖ్యంగా దానం నాగేందర్ ఢిల్లీతో పాటు బెంగళూరుకు చక్కర్లు కొడుతున్నారు. హస్తిన నేతలతో పాటు AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే కుమారుడిని కలిసి బీఫాం కోరారని తెలుస్తోంది. అటు ఢిల్లీకి వెళ్లిన CM రేవంత్‌తో ఖర్గే తనయుడు ఈ అంశంపై కాసేపటి క్రితం భేటీ అయినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఖర్గేతో రేపు ఉదయం రేవంత్ సమావేశం కానున్నారు.
News September 18, 2025
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మంత్రి సుభాష్ భేటీ

వెలగపూడి సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ఆయన ఛాంబర్లో గురువారం కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించారు. పంచాయితీరాజ్ శాఖతో కార్మికశాఖకు ముడిపడి ఉన్న అంశాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో మంత్రి ప్రస్తావించారు. వీటిపై ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.
News September 18, 2025
విశాఖలో 524 ఆక్రమణల తొలగింపు

విశాఖలో ఆపరేషన్ లంగ్స్‌లో భాగంగా 524 ఆక్రమణల తొలగించారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు ఆపరేషన్ లంగ్స్ చేపట్టినట్లు చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర రావు గురువారం తెలిపారు. జోన్ 1లో 20 ఆక్రమణలు, జోన్-2 90, జోన్ -3లో 42, జోన్ -4 60, జోన్ -5లో 52, జోన్-6లో 86, జోన్ – 7లో 42, జోన్-8లో 67 ఆక్రమణలు తొలగించారు.