News September 25, 2024

గుంటూరు: గడ్డపారతో భార్య తల పగలకొట్టిన భర్త

image

భర్తపై భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. హనుమయ్య నగరకు చెందిన వెంకటరమణ అనే మహిళ తన భర్త వెంకటేశ్వర్లు తరచూ గొడవ పెట్టుకుని కొడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ తర్వాత కూడా కేసు వెనక్కి తీసుకోమని గడ్డపార తీసుకుని తల పగలగొట్టాడని భార్య వెంకటరమణ పోలీసుల ఎదుట వాపోయింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Similar News

News January 8, 2026

GNT: కనీసం డైరెక్టర్ పదవులైనా స్థానికులకు కేటాయిస్తారా?

image

గుంటూరు మిర్చి యార్డు ఛైర్మన్‌గా పల్నాడు జిల్లాకు చెందిన కుర్రా అప్పారావు నియామకంపై స్థానిక క్యాడర్‌లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. గుంటూరు జిల్లాకు చెందిన అర్హులను పక్కనపెట్టి ఇతర జిల్లా నేతకు పదవి అప్పగించడంపై కూటమి శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇది స్థానిక క్యాడర్‌కు అన్యాయమనే వాదన బలంగా వినిపిస్తోంది. కనీసం డైరెక్టర్ పదవులైనా స్థానికులకు కేటాయిస్తారా? అన్న ప్రశ్న చర్చనీయాంశమైంది.

News January 8, 2026

మంగళగిరి పెద్ద రథోత్సవంపై గ్రహణం నీడ.. ఊరేగింపు జరిగేనా.?

image

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు ఘట్టంపై సందిగ్ధత నెలకొంది. బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే పెద్ద రథోత్సవం మార్చి 3వ తేదీన జరగాల్సి ఉంది. అదే రోజున చంద్రగ్రహణం ఏర్పడనుండటంతో రథోత్సవం నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. గ్రహణం కారణంగా ఇప్పటికే TTD సహా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలన్నీ మార్చి 3న మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. ఆగమ శాస్త్ర పండితుల సలహాల కోసం దేవాలయ అధికారులు వేచి చూస్తున్నారు.

News January 8, 2026

తెనాలి: విద్యార్ధి ఆత్మహత్యకు కారణలివేనా?

image

వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ విద్యార్థి రాఘవేంద్ర వెంకట్ బుధవారం కాలేజీ టాయిలెట్లోనే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తెనాలి(M) నందివెలుగుకి చెందిన అతడి ఆత్మహత్యకు అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, బ్యాక్ లాగ్స్ కారణమని తెలుస్తోంది. రోజు మాదిరిగా కాలేజీకి వచ్చిన వెంకట్ మధ్యలో స్నేహితుడు బైక్ తీసుకుని వెళ్లి బాటిల్లో పెట్రోల్ తెచ్చుకొని టాయిలెట్లో నిప్పు అంటించుకున్నట్లు సమాచారం.