News October 6, 2024
గుంటూరు: చదివింది ఇంజినీరింగ్.. చేసేది చోరీలు

మెకానికల్ ఇంజినీరింగ్ చదివి చెడు వ్యసనాలకు బానిసగా మారి చోరీలు చేస్తున్న యువకుడిని పట్టాభిపురం పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు స్టేషన్ ఎస్.హెచ్.ఓ వీరేంద్రబాబు మాట్లాడుతూ.. గొర్రెల చినబాబు అనే యువకుడు ఎస్వీఎన్ కాలనీలో జరిగిన చోరీ కేసులో ముద్దాయిగా ఉన్నాడని, గతంలో ఇతనిపై అనేక కేసులు కూడా ఉన్నాయని చెప్పారు. నిందితుడి నుంచి రూ.10 లక్షలు విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
Similar News
News January 15, 2026
సైనికుల ఖార్ఖానా.. బావాజీపాలెం

నేడు జాతీయ సైనిక దినోత్సవం. ఈ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం బావాజీపాలెం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీనిని ‘జవాన్ల ఊరు’గా పిలుస్తారు. ఇక్కడ ప్రతి ఇంటి నుంచి కనీసం ఒకరు సైన్యంలో పనిచేస్తుండటం విశేషం. రెండో ప్రపంచ యుద్ధం నుంచి నేటి వరకు ఇక్కడి వారు దేశసేవలో తరిస్తున్నారు. యువత ఉదయాన్నే మైదానంలో కసరత్తులు చేస్తూ, ఆర్మీలో చేరడమే ఏకైక లక్ష్యంగా శ్రమిస్తుంటారు.
News January 15, 2026
GNT: రంగస్థల దిగ్గజం మొదలి నాగభూషణశర్మ

గుంటూరు (D) ధూళిపూడిలో 1935 జులై 24న జన్మించిన మొదలి నాగభూషణశర్మ, ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు. ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయం, అమెరికాలోని ఇల్లినాయిస్ వర్సిటీలో ఉన్నత విద్యనభ్యసించారు. సుమారు 70కి పైగా నాటకాలు, నాటికలు, రేడియో నాటికలు రచించారు. సాహిత్యం, నాటక రంగాలకు ఆయన చేసిన సేవలకుగాను ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం (2013) వంటి ఎన్నో అవార్డులు వరించాయి. 2019 జనవరి 15న తెనాలిలో మరణించారు.
News January 15, 2026
సంక్రాంతి.. కోళ్లను ఇలా గుర్తించండి

ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా చరిత్రలో కోడి పందేలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈకల రంగు, కాళ్ల రంగు, కళ్ల రంగును బట్టి వాటిని వేర్వేరు పేర్లతో పిలుస్తారు.
#డేగ: ఎరుపు రంగు ఈకలు కలిగినవి.
#కాకి: నలుపు రంగు ఈకలు కలిగినవి.
#నెమలి: పచ్చని రంగు ఛాయ కలిగినవి.
#పర్ల: తెలుపు రంగు ఈకల మీద నల్లటి మచ్చలు ఉన్నవి.
#అబ్రాస్: ఎరుపు, తెలుపు, నలుపు కలిసిన మిశ్రమ రంగు.
#సేతు: పూర్తిగా తెల్లగా ఉండే కోడి.


