News April 25, 2024
గుంటూరు జిల్లాలో అసెంబ్లీ స్థానాలకు ఒక్కరోజే 64 నామినేషన్లు

గుంటూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు బుధవారం 64 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు తెలిపారు. వివిధ రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు అందజేసిన నామినేషన్ల నియోజకవర్గాల వారీ వివరాలు.. తాడికొండ నియోజకవర్గం 5, మంగళగిరిలో 17, పొన్నూరులో 5, తెనాలిలో 5, ప్రత్తిపాడు లో 20, గుంటూరు పశ్చిమలో 9, గుంటూరు తూర్పులో మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయి.
Similar News
News April 21, 2025
జర్మన్ యువకుడిని పెళ్లాడిన మంగళగిరి యువతి

మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన మౌనిక జర్మనీలో PHD చేస్తూ ఉద్యోగం చేస్తుంది. అక్కడే పనిచేస్తున్న జర్మన్ యువకుడు ఫాబియన్ డువెన్ బేక్‌తో పరిచయం ప్రేమగా మారింది. ఇరువురి తల్లిదండ్రుల అంగీకారంతో వీరి వివాహం ఆదివారం పెదవడ్లపూడిలో ఘనంగా జరిగింది. మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ దంపతులు వధూవరులను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
News April 21, 2025
GNT: బాబోయ్ అడ్మిషన్‌లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్

జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్‌లో అయితే టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తెస్తేనే జీతాలు ఇస్తామంటూ హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట పరుగులు పెడుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు.
News April 21, 2025
నేడు గుంటూరులో చెక్కుల పంపిణీ

గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం చెక్కుల పంపిణీ కార్యక్రమం జరగనుంది. శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి విస్తరణలో భాగంగా భూ సేకరణకు అంగీకరించిన యజమానులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. కేంద్ర సహయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై యజమానులకు నష్టపరిహారం చెక్కులను అందజేస్తారు. ఇందుకోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.