News March 22, 2025
గుంటూరు జిల్లాలో ఈగల్ తనిఖీలు

గుంటూరు జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులపై ఈగల్ సిబ్బంది దాడులను శుక్రవారం నిర్వహించారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్న షాపులు.. గుంటూరులో రెండు, తెనాలిలో షాపులను ఈగల్ సిబ్బంది సీజ్ చేశారు. ఈగల్ అధికారులు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులు, ఏజెన్సీల్లో తనిఖీలు కొనసాగుతాయని, డ్రగ్స్ దుర్వినియోగంపై దాడులు నిర్వహిస్తామన్నారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 25, 2025
సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

సత్తెనపల్లి (M) రెంటపాళ్లలో గురువారం ప్రమాదం జరిగింది. ఘటనలో యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. మృతుడు మహేశ్ ఓ ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. పుట్టిన రోజు కావడంతో విధులు ముగించుకొని బైక్‌పై ఇంటికి వస్తుండగా DDపాలెం రోడ్డులో ఎదురుగా వచ్చిన పాల వ్యాన్ ఢీకొట్టింది. దీంతో మహేశ్ స్పాట్‌లోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
News April 25, 2025
GNT: ట్రిపుల్ ఐటీలో ఇంటిగ్రేటెడ్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతిలో సాధించిన మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నారని పొన్నూరు ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. ఈ నెల 27 నుంచి మే 20వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థుల నుంచి రూ.300, రిజర్వు గ్రూపుల నుంచి రూ.200 చెల్లించాలన్నారు.
News April 25, 2025
మేయర్ అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తాం: అంబటి

గుంటూరు మేయర్ ఎన్నికపై వైసీపీ అనూహ్య మలుపు తిరిగింది. పోటీలో వైసీపీ పోటీ చేయదని రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే అంబటి రాంబాబు అభ్యర్థిని ప్రకటిస్తామని గురువారం తెలిపారు. ఈ నెల 28న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేతలు బృందావన్ గార్డెన్స్‌లో సమావేశమయ్యారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, డైమండ్ బాబు తదితరులు పాల్గొన్నారు.