News August 16, 2024
గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం

గుంటూరు జిల్లా పెదకాకానిలో శుక్రవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. లోదర్ గిరి కాలనీకి చెందిన ఇద్దరు పిల్లలు ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా వారిపై గోడ పడింది. ఈ ప్రమాదంలో కోలాటపు సాత్విక్ (12), బంగారపు సిద్ధార్థ్ (13) మృతి చెందారు. ఒక పిల్లోడు అక్కడికక్కడే చనిపోగా, మరో పిల్లవాడిని హాస్పిటల్ తీసుకెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో మృతి చెందాడు
Similar News
News December 16, 2025
నేడు సీఎం చంద్రబాబు బిజీ డే షెడ్యూల్

@ 10:15 గంటలకు సచివాలయానికి చేరుకున్న సీఎం, రాష్ట్రంలో గేట్స్ ఫౌండేషన్ సేవల అమలుపై సమీక్ష నిర్వహించారు.
@ మధ్యాహ్నం 3:15 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారు.
@ సాయంత్రం 4:55 గంటలకు మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌కు చేరుకున్నారు. 5 గంటలకు కొత్తగా నియామకమైన కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో పాల్గొంటారు.
@ రాత్రి 7.20 గంటలకు సీఎం తన నివాసానికి చేరుకుంటారు.
News December 16, 2025
GNT: నిలకడగా స్క్రబ్ టైఫస్ రోగుల ఆరోగ్య పరిస్థితి

గుంటూరు జీజీహెచ్‌లో స్క్రబ్ టైఫస్ జ్వరాలతో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. బుధవారం జీజీహెచ్‌కు వచ్చిన 13 మంది జ్వర బాధితుల నమూనాలను పరీక్షించగా, మంగళగిరి, అమృతలూరుకు చెందిన ఇద్దరికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ ఇద్దరిని ఇన్పేషెంట్లుగా చేర్చుకుని వైద్యం అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
News December 16, 2025
GNT: నూతన కానిస్టేబుల్స్‌తో నేడు సీఎం సమావేశం

పోలీసు శాఖలో నూతనంగా జాయిన్ అవుతున్న వారితో CM చంద్రబాబు మంగళగిరిలో నేడు సమావేశం కానున్నారు. 6,100 మందిని రిక్రూట్ చేసుకునేందుకు నోటిఫికేషన్ ఇవ్వగా అందులో 6,014 మంది సెలక్ట్ అయ్యారు. వీరిలో 5,757 మంది ట్రైనింగ్‌కు ఎంపిక అయ్యారు. సివిల్ కానిస్టేబుళ్లుగా 3,343 మంది, APSP కానిస్టేబుళ్లుగా 2,414 మంది ఎంపికవ్వగా సివిల్‌లో మహిళా కానిస్టేబుళ్లు 993 మంది ఉన్నారు. వీరికి ఈ నెల నుంచి ట్రైనింగ్ మొదలవుతుంది.


