News April 28, 2024
గుంటూరు జిల్లాలో తుది ఓటర్లు 17,91,543 మంది

గుంటూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో 17,91,543 మందికి ఎన్నికల సంఘం ఓటు హక్కు కల్పించింది. జిల్లాలో పురుష ఓటర్లు 8,65,377 మంది, మహిళలు 9,26,007 మంది, మూడో వర్గం 159 మంది కలిపి మొత్తం 17,91,543 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 60,630 మంది ఎక్కువ. తుది జాబితాలో ఓటు పొందిన వారు మే 13న జరగనున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Similar News
News April 12, 2026
GNT: కటకటాల్లోకి సహాయ కమిషనర్.. ఉద్యోగం నుంచి సస్పెండ్

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ACB అధికారులు సహాయ కమిషనర్ శాంతిపై కేసు నమోదు చేశారు. ఈ నెల 7న నిర్వహించిన తనిఖీల్లో రూ. 1.37 కోట్ల అక్రమాస్తులను గుర్తించి ఆమెను అరెస్టు చేశారు. కోర్టు 21వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో ఆమెను విజయవాడ జైలుకు తరలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 48 గంటలకు పైగా కస్టడీలో ఉన్నందున, ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News April 12, 2026
ఇక ఆన్‌లైన్‌లోనూ ‘మీకోసం’ అర్జీలు: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) దరఖాస్తులను ప్రజలు ఇకపై ఆన్‌లైన్‌లోనూ సమర్పించవచ్చని కలెక్టర్ సాయి కాంత్ వర్మ తెలిపారు. Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా అర్జీలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఫిర్యాదుల స్థితిగతులను తెలుసుకునేందుకు 1100 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.