News April 3, 2025

గుంటూరు జిల్లాలో బార్లకు ఈ-వేలం

image

రాష్ట్రంలో లైసెన్సు ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బిడ్ అమౌంట్ చెల్లించని బార్లను ఈ-వేలం ద్వారా ఔత్సాహికులకు కేటాయించేందుకు అబ్కారీ శాఖ నిర్ణయించింది. జనాభా ప్రాతిపదికన రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నిర్ణయించారు. ఏప్రిల్ 9న అత్యధిక బిడ్‌దారులకు లైసెన్సులు కేటాయించనున్నారు. అందులో గుంటూరు జిల్లాలో తెనాలి మునిసిపాలిటీకి-5, పొన్నూరు-2, మంగళగిరి-తాడేపల్లికి-1 కేటాయించారు.

Similar News

News April 12, 2025

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో పొన్నూరు అమ్మాయి ప్రతిభ

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో పొన్నూరుకు చెందిన విద్యార్థిని సత్తా చాటుకుంది. నాదెండ్ల కృష్ణ ప్రియ అనే విద్యార్థిని ఇంటర్ ఫస్ట్ ఈయర్‌లో 467 మార్కలు సాధించింది. ఆమె ఫాదర్ గవర్నమెంట్‌ టీచర్‌గా పని చేస్తున్నారు. మంచి మార్కులు రావడంపై తల్లిదండ్రులు, అధ్యాపకులు కృష్ణ ప్రియను అభినందిస్తున్నారు.

News April 12, 2025

ఇంటర్ రిజల్ట్స్.. సత్తా చాటిన ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు

image

రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సంబంధించి ఫస్టియర్‌లో గుంటూరు జిల్లా 58 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచింది. సెకండియర్‌లో 76% ఉత్తీర్ణతతో జిల్లా విద్యార్థులు 2వ స్థానంలో నిలవడం విశేషం. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు సాధించిన ఈ విజయాన్ని అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందిస్తున్నారు.

News April 12, 2025

గుంటూరు: హత్య కేసులో నిందితుల అరెస్ట్

image

పాత గుంటూరులో ఏప్రిల్ 1న జరిగిన హత్య కేసులో పరారీలో ఉన్న ఫైరోజ్, ఫయాజ్‌‌లు అరెస్టైయ్యారు. షేక్ అర్షద్ బాలికను వేధిస్తున్నాడు. విషయం తెలుసుకున్న బాలిక సోదరులు ఫైరోజH, ఫయాజ్‌లు స్నేహితులతో కలిసి అర్షద్‌ను తీవ్రంగా కొట్టారు. దీంతో అర్షద్ కుటుంబ సభ్యులు బాలిక కుటుంబంపై దాడి చేశారు. ప్రతిగా ఫైరోజ్, ఫయాజ్‌లు అర్షద్ కుటుంబంపై దాడి చేయడంతో అర్షద్ అమ్మమ్మ చనిపోయింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

error: Content is protected !!