News December 29, 2024

గుంటూరు జిల్లాలో 16 శాతం క్రైమ్ రేటు తగ్గింది: ఎస్పీ

image

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఎస్పీ సతీశ్ కుమార్ వార్షిక మీడియా సమావేశం నిర్వహించారు. గత ఏడాదితో పోల్చితే 16 శాతం క్రైమ్ రేటు గుంటూరు జిల్లాలో తగ్గిందని వెల్లడించారు. జిల్లాలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గించామన్నారు. రోడ్డు ప్రమాదాలు 5 శాతం పెరిగాయని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 224 మందిని గంజాయి కేసుల్లో పట్టుకొని 12 మందిపై పీడీ యాక్ట్ పెట్టామన్నారు.  

Similar News

News November 19, 2025

గరుడ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

image

వెలగపూడి సచివాలయంలోని గరుడ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం పరిశీలించారు. వీవీఐపీ బందోబస్తు, ట్రాఫిక్ పర్యవేక్షణలో కేంద్రం కీలకమని పేర్కొంటూ పనిచేయని కెమెరాలను వెంటనే పునరుద్ధరించాలని, డ్రోన్ గస్తీని కట్టుదిట్టం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు-కరకట్ట మార్గాల్లో రాకపోకలకు అంతరాయం లేకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు.

GNT: 26న జెడ్పీ స్థాయి సంఘ సమావేశం

image

జిల్లా పరిషత్ 6వ స్థాయి సంఘ సమావేశాన్ని ఈ నెల 26న నిర్వహిస్తున్నట్లు జెడ్పీ ముఖ్య కార్య నిర్వహణాధికారి వి. జ్యోతిబాసు తెలిపారు. ఉదయం 10:30 నుంచి ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఛాంబర్‌లో జిల్లా పరిషత్ వైస్ ఛైర్‌పర్సన్ అనురాధ అధ్యక్షతన స్థాయి సంఘ సమావేశం జరుగుతుందన్నారు. సాంఘిక, గిరిజన, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు, తదితర అంశాలపై సమీక్ష జరుగుతుందన్నారు.