News February 20, 2025
గుంటూరు జిల్లా టుడే టాప్ న్యూస్

★ ANU ఫ్యాకల్టీకి బెస్ట్ టీచర్ అవార్డ్
★ పెన్షన్ల పరిశీలన పారదర్శకంగా జరుగుతుంది: మంత్రి కొండపల్లి
★ గవర్నర్ని కలిసిన వైసీపీ శ్రేణులు
★ స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించిన ఎస్పీ సతీశ్
★ మాదక ద్రవ్యాలపై నియంత్రణకు కలెక్టర్ నాగలక్ష్మీ ఆదేశాలు
★ రేపటి నుంచి జీఎంసీలో ఓటర్ వెరిఫికేషన్ సేవలు
★ పది విద్యార్థులు ఒత్తిడికి గురవ్వొద్దు: DEO
Similar News
News November 2, 2025
PGRSని సద్వినియోగం చేస్కోండి : కలెక్టర్

ప్రజాసమస్యల పరిష్కార వేదిక (PGRS)లో సమర్పించిన అర్జీల స్థితిని టోల్ ఫ్రీ 1100 ద్వారాతెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. Meekosam.ap.gov.in వెబ్సైట్ లోనూ నమోదు చేసుకోవచ్చని చెప్పారు. సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు మండల కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
News November 1, 2025
ANU: బీఈడీ, ఎల్ఎల్ఎం రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో జరిగిన పలు యూజీ, పీజీ పరీక్షలకు సంబంధించి రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు శనివారం తెలిపారు. తృతీయ సెమిస్టర్ బిఈడి, ఎల్.ఎల్.ఎమ్ పరీక్ష ఫలితాలను ప్రకటించామన్నారు. ఫలితాలను వర్సిటీ వెబ్సైట్ నుంచి పొందవచ్చని తెలిపారు.
News November 1, 2025
ANU: యూజీ, పీజీ పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో జరిగిన బీటెక్, బీఈడి, ఎమ్మెస్సీ నానో టెక్నాలజీ, ఎంటెక్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు శనివారం తెలిపారు. రీవాల్యుయేషన్ కు దరఖాస్తులను ఈ నెల 10వ తేదీలోగా అందజేయాలని సూచించారు. రీవాల్యుయేషన్కు ప్రతి పేపర్కు రూ.1860 చొప్పున, జవాబు పత్రాల వ్యక్తిగత పరిశీలన, జిరాక్స్ కాపీలకు రూ.2190 చొప్పున చెల్లించాలన్నారు.


