News January 12, 2025
గుంటూరు జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక

ఈ నెల 13వ తేదీన భోగి పండుగను పురస్కరించుకొని కలెక్టరేట్లో ప్రతీ సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం జరగదని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు విషయాన్ని గమనించి తమ అర్జీలు సమర్పించే కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత జరిగే పీజీఆర్ఎస్ పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదులు తెలియజేయవచ్చని అన్నారు.
Similar News
News February 6, 2025
ఫైళ్ల క్లియరెన్స్.. లోకేశ్‌కు 8వ ర్యాంకు

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో గుంటూరు జిల్లా మంత్రులు నాదెండ్ల మనోహర్ 4 ర్యాంకు రాగా, లోకేశ్‌కు 8వ ర్యాంకు పొందారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సీఎం సూచించారు.
News February 6, 2025
ANU: దూరవిద్యలో ఫైర్ సేఫ్టీ కోర్సులు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫైర్ అండ్ సేఫ్టీ విశాఖపట్నం మధ్య విద్యాసంబంధ సహకారాన్ని కొనసాగించడం కోసం బుధవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వర్సిటీ వీసీ కె.గంగాధరరావు మాట్లాడుతూ.. అగ్ని భద్రత, అత్యవసర ప్రతిస్పందన సంబంధిత రంగాలలో ఎన్ఐఎఫ్ఎస్ గత 25ఏళ్ళుగా శిక్షణ ఇస్తుందన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సుల వలన ఉద్యోగాలు లభిస్తాయన్నారు.
News February 6, 2025
గుంటూరు: బీఈడీ పరీక్షల ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిధిలో నవంబర్- 2024లో నిర్వహించిన స్పెషల్ బీఈడీ 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం సూచించింది.