News March 18, 2025

గుంటూరు జిల్లా TODAY TOP NEWS

image

* గుంటూరులో 10వ తరగతి పరీక్ష కేంద్రం వద్ద ఆందోళన 
* డ్రగ్స్ గంజాయిపై ఉక్కు పాదం మోపుతాం: మంత్రి లోకేశ్
* గుంటూరులో డ్వాక్రా గ్రూప్ ప్రెసిడెంట్ మోసం
* వాలంటీర్ల రెగ్యులరైజ్‌పై మంత్రి క్లారిటీ 
* మాజీ ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి మాజీ సీఎం జగన్
* తల్లిదండ్రుల పట్ల దురుసుగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు
* అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య 
* మంగళగిరిలో గంజాయి ముఠా అరెస్ట్

Similar News

News October 23, 2025

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితులపై గురువారం అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. గండి పడే అవకాశం ఉన్న వాగులు, వంకలు, చెరువులను నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవసరం మేరకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. పంటలు రక్షించుకునే విధంగా రైతులకు తగు సూచనలు జారీ చేయాలన్నారు.

News October 23, 2025

భారీ వర్షాలు.. గుంటూరు జిల్లాలో స్కూళ్లకు హాలిడే

image

గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గురువారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ డీఈవో సీవీ రేణుక ఆదేశాలు జారీ చేశారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉండటంతో పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు అయోమయంలో పడ్డారు. వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

News October 23, 2025

నేడు భగినీ హస్త భోజనం.. విశిష్టత తెలుసా?

image

భగినీ హస్త భోజనం.. సోదరీ సోదరుల ఆప్యాయతానురాగాలకు అద్దం పట్టే సాంప్రదాయ వేడుక ఇది. దీపావళి రెండో రోజు కార్తీక మాసంలో జరుపుకునే ఎంతో విశేషమైన ఈ పండుగ నాడు అక్కాచెల్లెళ్లు సోదరులను ఇంటికి పిలిచి నుదుట బొట్టు పెట్టి హారతి ఇచ్చి భోజనం తినిపించి శుభాకాంక్షలు తెలుపుతారు. తమ సోదరులు ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తారు. ఈ రోజును పుష్ప ద్వితీయ, యమ ద్వితీయ, కాంతి ద్వితీయ వంటి అనేక పేర్లతో పిలుస్తారు.