News June 29, 2024

గుంటూరు జీజీహెచ్‌లో కేంద్రమంత్రి పెమ్మసాని సమీక్ష

image

గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలోని వైద్య అధికారులతో కేంద్రమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ క్యాజువాలిటీ, ఎంఆర్ఐ, ఐసీయూ విభాగాలను ఆయన పరిశీలించి, రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, గళ్లా మాధవి, మహమ్మద్ నసీర్ పాల్గొన్నారు.

Similar News

News October 7, 2024

అమరావతి: టమాటా, ఉల్లి ధరల పెరుగుదలపై సమీక్ష

image

టమాటా, ఉల్లి ధరలు పెరుగుదల అంశంపై అమరావతి సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో టమాట, ఉల్లి కొనుగోళ్లు చేసి రైతు బజార్లలో విక్రయించాలని ఆదేశాలు జారీ చేశారు. ధరల పెరుగుదలను నియంత్రించి సాధారణ ధరలకు విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు.

News October 7, 2024

గుంటూరు: డిప్లొమా పరీక్షల టైంటేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్)పరిధిలో ఫుడ్ ప్రొడక్షన్, సైకలాజికల్ గైడెన్స్&కౌన్సెలింగ్‌లో డిప్లొమా కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన ఇయర్ ఎండ్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు ఈ నెల 27 నుంచి నవంబర్ 1 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News October 7, 2024

టీడీపీలోకి మోపిదేవి.. ముహూర్తం ఫిక్స్..?

image

వైసీపీ మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. రేపల్లె నియోజకవర్గ కార్యకర్తలు, అభిమానులతో చర్చించిన అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 9న ఆయన సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరతారని అభిమానులు చెబుతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి ఆయన ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.