News March 11, 2025
గుంటూరు: జీబీఎస్ కలకలం.. 3కు చేరిన మృతులు

గుంటూరులో జీబీఎస్ మరణాల సంఖ్య మూడుకు చేరింది. పల్నాడు జిల్లా మాదలకు చెందిన సీతామహాలక్ష్మి (50) ఈనెల 5న జీజీహెచ్ లో చేరారు. కాగా చికిత్స పొందుతూ.. సోమవారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. జీబీఎస్ లక్షణాలతో చికిత్స పొందుతున్న మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
Similar News
News February 11, 2026
పనివేళల్లోనే సర్వేలు చేయించాలి: కలెక్టర్

సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి లేకుండా, కేవలం పనివేళల్లోనే సర్వేలు నిర్వహించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి MPDOలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ‘అక్షర ఆంధ్ర’, ‘యూనిఫైడ్ ఫ్యామిలీ’ సర్వేల పురోగతిని సమీక్షించారు. సిబ్బంది సేవలను సమతుల్యంగా వినియోగించుకోవాలని, సర్వేల నిర్వహణను పర్యవేక్షణ అధికారులు నిరంతరం మానిటర్ చేయాలని సూచించారు.
News February 11, 2026
GNT: శివరాత్రి ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని శివాలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. దేవదాయ, రెవెన్యూ, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గత ఏడాది కంటే మెరుగ్గా ఏర్పాట్లు ఉండాలని, భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News February 11, 2026
బడ్జెట్ సమావేశాల్లో గుంటూరు గళం వినిపించనుందా?

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానుండటంతో గుంటూరు జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళం విప్పేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలో ఇద్దరు కీలక మంత్రులు ఉండటంతో పెండింగ్ నిధులు మంజూరవుతాయని ఆశలు వ్యక్తమవుతున్నాయి. సాగునీరు, తాగునీటి సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, డ్రైనేజ్, వీధి కుక్కల నియంత్రణ, ఆసుపత్రులు, రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


