News May 23, 2024
గుంటూరు: జూన్ 1 నుంచి ఓపెన్ స్కూల్ సొసైటీ సప్లమెంటరీ పరీక్షలు

జిల్లాలో ఓపెన్ స్కూల్ సొసైటీ 10వ తరగతి, ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు జూన్ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయని డీఈవో శైలజ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సప్లమెంటరీ పరీక్షలు కోసం విద్యార్థులు జిల్లా కో – ఆర్డినేటర్ ద్వారా హాల్ టికెట్లు పొందవచ్చని చెప్పారు. అదేవిధంగా https://www.apopenschool.ap.gov.in వెబ్ సైట్ ద్వారా కూడా హాల్ టికెట్లు పొందవచ్చని ఆమె పేర్కొన్నారు.
Similar News
News February 26, 2026
గుంటూరుకు రానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మార్చి 1న గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఏపీ జ్యుడిషియల్ అకాడమీ భవనం, ఏపీ హైకోర్టు నూతన నిర్మాణాల శంకుస్థాపనలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటన ఏర్పాట్లపై సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామల రావు గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, జేసీ అశుతోష్ శ్రీవాస్తవ పాల్గొన్నారు.
News February 26, 2026
తెనాలిలో రేపు ఆయేషా మీరా అంత్యక్రియలు

ఆయేషా మీరా అస్థికలను సీబీఐ ఆమె తల్లిదండ్రులకు అప్పగించనుంది. రేపు తెనాలిలో భారీ బందోబస్తు నడుమ ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కేసులో దర్యాప్తు సంస్థలన్నీ విఫలమయ్యాయని ఆయేషా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తమకు న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేసును హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని, డిసెంబర్ 27ను ఆయేషా సంస్మరణ దినంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.
News February 26, 2026
గుంటూరు: డ్రంక్ & డ్రైవ్‌లో ఒకరికి జైలు శిక్ష

గుంటూరు ట్రాఫిక్ విభాగం నగరంలో ముమ్మరంగా డ్రంక్ & డ్రైవ్ తనిఖీలు నిర్వహించింది. గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ సీఐ సింగయ్య ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో 10 మంది వాహనదారులు పట్టుబడ్డారు. వారిలో ముగ్గురికి రూ.7,000ల చొప్పున, ఆరుగురికి రూ.5,000ల చొప్పున జరిమానా విధించారు. ఒకరికి 3 రోజుల జైలు శిక్ష విధించారు. మొత్తం రూ.51,000 జరిమానా వసూలైందని, ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని పోలీసులు హెచ్చరించారు.


