News July 24, 2024
గుంటూరు జేసీగా భార్గవ తేజ బాధ్యతలు

గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా భార్గవ తేజ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తనపై నమ్మకంతో జిల్లాకు నియమించిందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలు, అన్ని శాఖలల సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల అధికారులు జేసీకి బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఈయన కర్నూల్ నగర కమిషనర్గా పని చేశారు.
Similar News
News October 14, 2025
GNT: సైబర్ నేరాలకు పాల్పడుతున్న వంటమాస్టర్ అరెస్ట్ !

గుంటూరు ఎస్వీఎన్ కాలనీకి చెందిన రైస్ మిల్లు యజమాని వెంకటేశ్వరరావు ఖాతా నుంచి రూ. కోటి కొల్లగొట్టిన సైబర్ నేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకొల్లుకు చెందిన నిందితుడు ఇంటర్ చదివి బెంగుళూరులో వంటమాస్టర్గా పనిచేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. అలా కొల్లగొట్టిన డబ్బును అతని స్నేహితులు ఖాతాలకు మళ్లించడంతో పాటూ క్రికెట్ బెట్టింగ్ కోసం వినియోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News October 13, 2025
ఇంటింటి సర్వేతో మున్సిపాలిటీల్లో పెరిగిన ఆదాయం

పన్నులు పెంచకుండా ఆదాయం పెంచుకోవాలని మున్సిపాలిటీలు సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇంటింటి పన్నుల పరిశీలన చేపట్టారు. ఇప్పటివరకు పన్నులు వేయని ఆస్తులు, తక్కువ మొత్తంలో పన్నులు చెల్లిస్తున్న ఆస్తులను గుర్తించి ఇంటింటి సర్వే చేపట్టారు. దీంతో పన్నుల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. గుంటూరు: 460, మంగళగిరి: 397, తెనాలి: 84, పొన్నూరు: 31, లక్షల్లో ఆదాయం సమకూరింది.
News October 12, 2025
నిబంధనలు ఉల్లంఘిస్తే బాణాసంచా దుకాణాలపై కఠిన చర్యలు: ఎస్పీ

అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా నిల్వ ఉంచినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ (ఐపీఎస్) ఆదివారం హెచ్చరించారు. బాణాసంచా దుకాణం వద్ద నీరు, ఇసుక, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వంటి అగ్నిమాపక పరికరాలు తప్పనిసరిగా ఉంచాలన్నారు. విక్రయాలలో మైనర్లను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.