News September 1, 2024
గుంటూరు: టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు

వర్షాల కారణంగా ప్రజల ఇబ్బందులను పరిష్కరించడానికి గుంటూరు కలెక్టరేట్, నగరపాలకసంస్థ కార్యాలయాల్లో టోల్ ఫ్రీ నంబర్లను అధికారులు అందుబాటులో ఉంచారు. జిల్లా ప్రజలు గుంటూరు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన 0863-2234014, 9849904013కి, అదేవిధంగా నగర ప్రజలు కార్పొరేషన్లో ఏర్పాటు చేసిన 0863-2345105, 9849908391 నంబర్లను సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సూచిస్తుంది. Share It
Similar News
News November 3, 2025
GNT: 4న పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ రాక

రాష్ట్ర శాసనసభా పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ ఈ నెల 4న గుంటూరు జిల్లాలో పర్యటిస్తుందని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్‌కి చేరుకుంటుందని చెప్పారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ కార్యకలాపాలను సమీక్షిస్తుందన్నారు. 2.30 ని.ల నుంచి ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ అంశాల పై సమీక్ష ఉంటుందన్నారు.
News November 2, 2025
GNT: భక్తులకు ఊరట.. అనుమతి ఇచ్చే అవకాశం?

బాపట్ల సూర్యలంక బీచ్‌ను నవంబర్ 3, 4 తేదీలలో (సోమవారం, మంగళవారం) తాత్కాలికంగా మూసివేసినట్లు RDO తెలిపారు. మెుంథా తుఫాను ప్రభావం వలన సముద్ర స్నానం చేయు ప్రాంతంలో భారీ గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా ఉన్నందున బీచ్‌ని మూసివేసినట్లు తెలిపారు. తదుపరి భద్రతా పరిశీలన చేసి ప్రకటన ఇచ్చేవరకు మూసివేయడమైనదని ఆయన తెలిపారు. కాగా కార్తీక పౌర్ణమికి అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
News November 2, 2025
PGRSని సద్వినియోగం చేస్కోండి : కలెక్టర్

ప్రజాసమస్యల పరిష్కార వేదిక (PGRS)లో సమర్పించిన అర్జీల స్థితిని టోల్ ఫ్రీ 1100 ద్వారాతెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. Meekosam.ap.gov.in వెబ్సైట్ లోనూ నమోదు చేసుకోవచ్చని చెప్పారు. సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు మండల కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.


