News October 12, 2024
గుంటూరు: డిగ్రీ పరీక్షల టైంటేబుల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో బీకామ్ జనరల్ & కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్స్ చదివే విద్యార్థులు రాయాల్సిన 1, 3వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 1వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 23 వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని, 3వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 24 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
Similar News
News November 8, 2024
అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు: అంబటి
కూటమి ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారనే ఆరోపణలపై YCP సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు అయిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తనదైన శైలిలో స్పందించారు. ‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అరెస్టులును సాగించి సోషల్ మీడియాని అడ్డలేరు’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో పాటు తాము నిజంవైపు నిలబడి ఉంటామంటూ ఓ ఫొటోను షేర్ చేశారు.
News November 7, 2024
వీవీఐటీలో మంత్రి నారా లోకేశ్ సందడి
అమరావతిలోని వీఐటీ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో మంత్రి లోకేశ్ ఆద్యంతం సందడి చేశారు. ముందుగా వర్సిటీ చేరుకున్న మంత్రి లోకేశ్‌కు విశ్వవిద్యాలయ నిర్వాహకులు, సిబ్బంది, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు.
News November 7, 2024
TDP కార్యకర్తను చంపేందుకు కుట్ర: యాగంటి
దుర్గి మండలానికి చెందిన టీడీపీ కార్యకర్త గోకుల గౌరీ యాదవ్ ను శ్యామరాజపురం, జమ్మలమడక గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు హత్య చేసేందుకు 2 రోజుల క్రితం కుట్ర పన్నారని మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ యాగంటి మల్లికార్జునరావు ఆరోపించారు. బాధితుడిని గురువారం పరామర్శించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో MLA జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో ఇలాంటి హత్యా రాజకీయాలకు వైసీపీ వారు పాల్పడితే తాట తీస్తామన్నారు.