News September 12, 2024

గుంటూరు: డిగ్రీ సప్లిమెంటరీ మూల్యాంకనం ప్రారంభం

image

ANU ఐదో సెమిస్టర్ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం గుంటూరు మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఈనెల 13న ప్రారంభవుతుందని ప్రిన్సిపల్ పి.ఎం.ప్రసాద్ తెలిపారు. వీటితో పాటు 7వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష పత్రాల మూల్యాంకనం కూడా జరుగుతుందన్నారు. మూల్యాంకన విధుల్లో పాల్గొనే అధ్యాపకులను విధుల నుంచి రిలీవ్ చేసి పంపాలని ఏఎన్యూ పరిధిలోని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్ ను కోరారు.

Similar News

News February 18, 2026

మంగళగిరి-తెనాలి రోడ్డు విస్తరణ

image

మంగళగిరి-తెనాలి రోడ్డును రూ.16.93 కోట్లతో 60 అడుగులకు విస్తరించనున్నారు. మంత్రి లోకేశ్ ఆదేశాలతో ఖబరస్థాన్‌కు ఇబ్బంది లేకుండా ‘కాంటిలివర్’ పద్ధతిలో నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనుల్లో 105 కట్టడాలు (28 పూర్తిగా, 77 పాక్షికంగా) ప్రభావితమవుతాయి. నిర్వాసితులకు రూ.12.5 కోట్ల పరిహారం, రూ.40 కోట్ల విలువైన TDR బాండ్లు (1:4 నిష్పత్తిలో) ఇవ్వనున్నారు. వీటిని బహిరంగ మార్కెట్లో అమ్ముకునే వెసులుబాటు కల్పించారు.

News February 17, 2026

ఉగాది నాటికి గృహ నిర్మాణాలే లక్ష్యం: కలెక్టర్

image

ఉగాది నాటికి నిర్దేశిత గృహ లక్ష్యాలు పూర్తిచేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. గృహ నిర్మాణం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పనులపై కలెక్టర్ కార్యాలయం నుంచి మండల ప్రత్యేక అధికారులు, MPDOలతో కలెక్టర్ వీసీ నిర్వహించారు. జిల్లాలో 22,952 గృహాలు పూర్తి చేయాలని అన్నారు. దీనిని పూర్తి చేయుటకు మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు శ్రద్ధ పెట్టాలన్నారు.

News February 17, 2026

GNT: తపాలా శాఖపై పెమ్మసాని సమీక్ష

image

గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తపాలా శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ, ఏపీ సహా పలు సర్కిళ్ల పనితీరును పరిశీలించారు. తెలంగాణ సర్కిల్ ఉత్తమ ఫలితాలు సాధించిందని ప్రత్యేకంగా ప్రశంసించారు. మిగిలిన సర్కిళ్లు ‘టెక్-ఫస్ట్’ విధానాన్ని పాటించాలని సూచించారు. వినియోగదారుల సంతృప్తే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణతో సేవలను వేగవంతం చేయాలని ఆదేశించారు.