News October 18, 2024

గుంటూరు: డ్రోన్ స‌మ్మిట్ ఏర్పాట్లలో కలెక్టర్, ఎస్పీ

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అక్టోబరు 22, 23న నిర్వహిస్తున్న అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్ 2024 విజయవంతంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఈ కార్యక్రమం ఏర్పాట్లపై ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కలెక్టరేట్ నుంచి వీసీ ద్వారా పాల్గొన్నారు.

Similar News

News November 11, 2024

గుంటూరు జిల్లాలో 14 నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్: కలెక్టర్

image

రాష్ట్ర బాలల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా ఈనెల 14వ తేదీ నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రారంభం కానుంది. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను సోమవారం కలెక్టర్ నాగలక్ష్మి , జేసీ భార్గవ్ తేజ‌ ఆవిష్కరించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వారి ఎదుగుదల లోపాలను గుర్తించేందుకు స్క్రీనింగ్ టెస్ట్ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని కలెక్టర్ తెలిపారు‌.

News November 11, 2024

2022-23 ఉమ్మడి గుంటూరు జిల్లా తలసరి ఆదాయం ఇదే.!

image

2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాల వారీగా తలసరి ఆదాయ లెక్కలను డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. ఈ లెక్కల ప్రకారం గుంటూరు జిల్లాకు 2,32,024 ఉండగా, పల్నాడు జిల్లాకు 1,70,807, బాపట్ల జిల్లాకు 1,96,853గా ఉంది. ఈ లెక్కల ప్రకారం విశాఖపట్నం జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో కృష్ణా జిల్లా, మూడవ స్థానంలో ఏలూరు జిల్లా ఉంది. 

News November 11, 2024

గుంటూరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గొంతు వినిపిస్తారా?

image

నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు ఉమ్మడి గుంటూరు ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఎన్నికలు జరిగాక తొలి బడ్జెట్ సమావేశం కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎన్నికలకు ముందు రోడ్ల సమస్యలు, తోటపల్లి ఎత్తిపోతల పథకం కాలువ పనులు, యువతకు ఉద్యోగ కల్పన తదితర అంశాలపై ప్రస్తుతం ఎన్నికైన ఎమ్మెల్యేలు హామీలు ఇచ్చారు. మరి వీటి అమలుకు నిధులు వచ్చేలా అసెంబ్లీలో చర్చిస్తారా? లేదా? అనేది వేచి చూడాలి.