News February 13, 2025

గుంటూరు: తల్లి మందలించిందని కుమారుడు సూసైడ్

image

తల్లి మందలించిందని కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్మభూమి నగర్‌లో జరిగింది. పూర్ణ కుమార్(20) పనికి వెళ్లడం లేదని బుధవారం తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన పూర్ణ కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పనికి వెళ్లి తిరిగొచ్చిన తల్లి కుమారుడు విగతజీవిగా ఉండడాన్ని చూసి నిశ్చేష్ఠురాలైంది. ఘటనపై ఆమె ఫిర్యాదుతో కేసు నమోదైంది.

Similar News

News February 13, 2025

వైసీపీటీఏ డైరీ ఆవిష్కరించిన వైఎస్ జగన్

image

తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఏపీ వైఎస్సార్టీఏ అధ్యక్షులు అశోక్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం సుధీర్, గౌరవ అధ్యక్షులు జాలిరెడ్డితో పాటుగా 26 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైసీపీటీఏ డైరీని జగన్ ఆవిష్కరించారు. అనంతరం ఉపాధ్యాయుల సమస్యల గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు.

News February 13, 2025

ప్రతిభ కనబరిచిన గుంటూరు పోలీసులు

image

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో ప్రతిభ కనబరిచిన గుంటూరు పోలీసులను గురువారం జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ అభినందించారు. అనంతపురంలోని పోలీసు ట్రైనింగ్ కాలేజీలో నిర్వహించిన పోటీలలో గుంటూరుకు చెందిన ఏడుగురు పోలీసులు మొత్తం 21 పతకాలు సాధించారు వాటిలో 8 బంగారు పతకాలు ఉన్నాయి. ఆయా పోలీసులకు గురువారం ఎస్పీ సతీశ్ కుమార్ చేతుల మీదగా పతకాలు, ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు.

News February 13, 2025

తాడేపల్లి: రేపు కడప వెళ్లనున్న మాజీ సీఎం

image

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్‌ జగన్‌ శుక్రవారం కడప వెళ్లనున్నట్లు పార్టీ సెంట్రల్ కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కడప చేరుకుంటారు. అక్కడ 11 గంటలకు మేడా రఘునాథ్ రెడ్డి కన్వెన్షన్‌లో ఎమ్మెల్సీ ఎం.వి.రామచంద్రారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం అక్కడి నుంచి బెంగళూరు బయలుదేరి వెళతారని తెలిపారు.

error: Content is protected !!