News January 20, 2025
గుంటూరు: తల్లీబిడ్డ మృతి.. ‘ఆచూకీ తెలిస్తే ఈ నంబర్లలో తెలపండి’
గుంటూరులోని బుడంపాడు వద్ద బిడ్డతో సహా తల్లి <<15198194>>రైలు కింద పడిన<<>> ఘటన కలిచివేసింది. అభంశుభం తెలియని తెలియని ఆ చిన్నారి రైల్వే ట్రాక్పై విగత జీవిగా పడి ఉండటం స్థానికుల కళ్లు చెమర్చింది. ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో.. ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుంది అంటూ ఆవేదన చెందారు. అయితే వీరి వివరాలు తెలియరాలేదు. ఆచూకీ తెలిసిన వారు గుంటూరు జీఆర్పీ ఎస్సై 8328018787, పోలీస్ స్టేషన్ 0863 222073 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
Similar News
News January 20, 2025
గుంటూరు: ANU డిగ్రీ ఫలితాలు విడుదల
నాగార్జున విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గతేడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో నిర్వహించిన డిగ్రీ కోర్సుల ఫలితాలను విడుదల చేసినట్లు దూరవిద్య పరీక్షల డిప్యూటీ రిజిస్ట్రార్ సయీద్ జైన్ లాబ్దిన్ తెలిపారు. ఫలితాలను సోమవారం వైస్ ఛాన్సలర్ గంగాధరరావు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఫలితాలను www.anucde.info వెబ్సైట్లో పొందుపరిచామని, ఫిబ్రవరి 3లోపు రీవాల్యూవేషన్కు ధరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
News January 20, 2025
వేమూరులో పురుగు మందు తాగి విద్యార్థిని మృతి
పురుగు మందు తాగి విద్యార్థిని మృతి చెందిన ఘటన వేమూరు అంబేడ్కర్ నగర్లో చోటుచేసుకుంది. అంబేడ్కర్ నగర్కు చెందిన బుస్సా రాము రెండవ కుమార్తె మేఘన ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతుంది. మేఘనకు తరచు కడుపునొప్పి రావడంతో ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి బుధవారం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. తల్లిదండ్రులు వైద్య చికిత్స కోసం తెనాలి వైద్యశాలకు తరలించగా ఆదివారం మృతి చెందినట్లు ఎస్ఐ రవి క్రిష్ణ తెలిపారు.
News January 20, 2025
గుంటూరులో నేటి నుంచి పశు వైద్య శిబిరాలు
ఈ నెల 20 నుంచి 31వ తేదీ వరకు పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి ఓ.నరసింహారావు వెల్లడించారు. ఈ మేరకు శిబిరానికి సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ నాగలక్ష్మీ ఆవిష్కరించారని తెలిపారు. జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. ప్రతీ మండలంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తామని, సద్వినియోగం చేసుకోవాలన్నారు.