News July 2, 2024

గుంటూరు: తాత్కాలికంగా కొన్ని రైళ్లు రద్దు

image

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని రైళ్లను, గుంటూరు-విజయవాడ మార్గంలో తాత్కాలికంగా రద్దు చేసినట్లు సీనియర్ డీసీ ప్రదీప్ కుమార్ సోమవారం వెల్లడించారు. రైలు నంబర్ 17329 (హుబ్లి-విజయవాడ) ఈ నెల 15 నుంచి 31వరకు, 17330 (విజయవాడ-హుబ్లి) ఈ నెల 16 నుంచి ఆగస్టు 1వరకు, 17282 (నరసాపూర్-గుంటూరు), 17281 (గుంటూరు- నరసాపూర్) ఈ నెల 1 నుంచి 31 వరకు రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News September 20, 2024

పల్నాడులో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

image

వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్డులోని ఓ సూపర్ మార్కెట్ వద్ద గురువారం రాత్రి 11 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు బైక్‌లు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News September 20, 2024

వెలగపూడి: రాష్ట్రంలో రూ.6585 కోట్లు మంజూరు: మంత్రి

image

రాష్ట్రంలో 384 కి.మి. మేర 7 జాతీయ రహదారుల అభివృద్దికి రూ.6,585 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసినట్లు మంత్రి బి.సి.జనార్థన రెడ్డి తెలిపారు. గురువారం వెలగపూడి లోని సచివాలయంలో ఆయన్ విలేకరులతో మాట్లాదారు. కేంద్ర  రోడ్డు రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ ఘడ్గరీ తో పలు మార్లు సంప్రదింపులు జరపడం వల్లే  ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్రానికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. 

News September 19, 2024

అమరావతి: పాఠశాలలకు దసరా సెలవులు ఎప్పటినుంచి అంటే?

image

రాష్ట్రంలో పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 2 నుంచి 14 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 15న తిరిగి స్కూళ్లు ప్రారంభమవుతాయని ఉత్తర్వులలో పేర్కొన్నారు.