News September 24, 2024
గుంటూరు: తిరుమల లడ్డూ వ్యవహరంపై సిట్ ఏర్పాటు
ప్రముఖ ఆలయ తిరుమల – తిరుపతి ఆలయ లడ్డూ ప్రసాదం విషయంపై సిట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం గుంటూరు సౌత్ కొస్టల్ జోన్ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠీని సిట్ చీఫ్‌గా ప్రభుత్వం నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లడ్డూ కల్తీ వ్యవహారంపై విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
Similar News
News October 9, 2024
14 నుంచి పల్లె పండగ-పంచాయతీ వారోత్సవాలు: కలెక్టర్
పల్లె పండగ-పంచాయతీ వారోత్సవాలను జిల్లాలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఈ మేరకు సచివాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 14 నుంచి 20వ తేదీ వరకు పంచాయతీ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, రూ.15.35కోట్లతో 176 పనులకు పరిపాలన మంజూరుకు ఉత్తర్వులు జారీ చేశారన్నారు. 160 సీసీ రోడ్ల పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
News October 9, 2024
గుంటూరు: మిర్చి యార్డుకు 3రోజులు దసరా సెలవులు
మిర్చియార్డు (గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ)కి ఈ నెల 11 నుంచి 13వరకు 3రోజుల పాటు దసరా సెలవులు ప్రకటించినట్లు పర్సన్ ఇన్‌ఛార్జ్ శ్రీనివాసరావు, సెక్రటరీ ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ఈ నెల 11వ తేదీన శుక్రవారం దుర్గాష్టమి, 12న శనివారం విజయదశమి, 13న ఆదివారం సాధారణ సెలవుదినమని అన్నారు. తిరిగి ఈ నెల 14వ తేదీ సోమవారం ఉదయం నుంచి యార్డులో లావాదేవీలు పునఃప్రారంభమవుతాయని చెప్పారు.
News October 8, 2024
మంగళగిరి: పవన్‌తో భేటీ అయిన సాయాజీ షిండే
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ సినీ నటుడు సాయాజీ షిండే మంగళవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఆలయాల్లో ప్రసాదంతో పాటూ ఒక మొక్కను కూడా ఇవ్వాలని రెండు రోజుల క్రితం షిండే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన ఆలోచనలను పంచుకోవడానికి పవన్‌ని మంగళగిరి క్యాంప్ కార్యాలయంలో కలిసినట్లు చెప్పారు.