News November 22, 2024
గుంటూరు: తుపాకీ మిస్ ఫైర్.. కానిస్టేబుల్ శ్రీనివాస్ మృతి

గుంటూరులో ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాస్ మృతి కలకలం రేపింది. పోలీసుల వివరాల మేరకు.. శ్రీనివాస్ ఎస్కార్ట్ సెక్యూరిటీకి డ్యూటీ చేస్తూ ఉంటాడు. అయితే తుపాకీ మిస్ ఫైర్ అయి శ్రీనివాస్ మృతిచెందినట్లు పోలీసులు చెబుతున్నారు. శ్రీనివాస్ మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ఉంచారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 8, 2026
తెనాలి: విద్యార్ధి ఆత్మహత్యకు కారణలివేనా?

వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ విద్యార్థి రాఘవేంద్ర వెంకట్ బుధవారం కాలేజీ టాయిలెట్లోనే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తెనాలి(M) నందివెలుగుకి చెందిన అతడి ఆత్మహత్యకు అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, బ్యాక్ లాగ్స్ కారణమని తెలుస్తోంది. రోజు మాదిరిగా కాలేజీకి వచ్చిన వెంకట్ మధ్యలో స్నేహితుడు బైక్ తీసుకుని వెళ్లి బాటిల్లో పెట్రోల్ తెచ్చుకొని టాయిలెట్లో నిప్పు అంటించుకున్నట్లు సమాచారం.
News January 8, 2026
గుంటూరులో నేడు సీఎం పర్యటన.. షెడ్యూల్ ఇదే.!

సీఎం చంద్రబాబు జనవరి 8న గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:30గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి అమరావతిలోని సెక్రటేరియట్కు చేరుకుంటారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా గుంటూరుకు రాగా, నల్లపాడు రోడ్డులోని రెడ్డి కాలేజ్ సమీపంలో నిర్వహించే సరస్ మేళా ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం విజయవాడ పున్నమి ఘాట్లో ‘ఆవకాయ-అమరావతి’ కార్యక్రమానికి హాజరై రాత్రి తిరిగి నివాసానికి చేరుకుంటారు.