News November 18, 2024
గుంటూరు: దివ్యాంగుల నుంచి వినతిపత్రం స్వీకరించిన కలెక్టర్
కలెక్టరేట్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన దివ్యాంగుల వద్దకే కలెక్టర్ వెళ్లి వినతిని స్వీకరించారు. తమ సమస్యలను అధికారులకు వివరించిన పట్టించుకోవడంలేదని విభిన్న ప్రతిభావంతులు కలెక్టర్‌ను వేడుకున్నారు. దివ్యాంగులకు కావాల్సిన వీల్ ఛైర్లు, బ్యాటరీ వాహనాలను, చెక్క కర్రలు, వినికిడి యంత్రాలను అందించాలని దివ్యాంగులు కోరారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు.
Similar News
News December 14, 2024
అల్లు అర్జున్ విడుదల.. అంబటి ట్వీట్
సినీ హీరో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల కావడంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా మరో ట్వీట్ చేశారు. ‘గురువు ఆజ్ఞ.. శిష్యుడు అమలు.. అల్లు అర్జున్ అరెస్టు.. నా మాట కాదు.. ఇది జనం మాట’! అంటూ అంబటి ఏపీ CM చంద్రబాబు, తెలంగాణ CM రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ను ట్యాగ్ చేశారు. కాగా అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో అంబటి వరుస ట్వీట్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
News December 14, 2024
బాపట్లలో దారుణం.. తల్లిదండ్రులను హత్యచేసిన తనయుడు
తల్లిదండ్రులను కన్నకొడుకు హత్య చేసిన సంఘటన బాపట్ల మండలం అప్పికట్ల గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. విజయభాస్కరరావు, సాయి కుమారి అనే దంపతులు అప్పికట్లలో గృహం నిర్మించుకొని నివాసం ఉంటున్నారని ఆస్తుల పంపకంలో విభేదాల గురించి సంబంధించి వీరి కుమారుడు కిరణ్ వారిని దారుణంగా హత్య చేశాడన్నారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సిఉంది. పోలీసులు హత్య జరిగిన ఇంటి వద్ద పహారా కాశారు.
News December 13, 2024
పద్మవ్యూహం నుంచి బయటకు వస్తున్న అర్జునుడికి శుభాకాంక్షలు
సినీ హీరో అల్లు అర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. పద్మవ్యూహం నుంచి బయటకి వస్తున్న అర్జునుడికి శుభాకాంక్షలు! అంటూ ఆయన పోస్ట్ చేశారు. కాగా ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్ అల్లుఅర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండించారు.