News January 21, 2025
గుంటూరు: దేహదారుడ్య పరీక్షల్లో 362 మంది ఉత్తీర్ణత

గుంటూరు పోలీస్ కవాత్ మైదానంలో జరుగుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుడ్య పరీక్షల్లో సోమవారం 362 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 680 మంది అభ్యర్థులు పరీక్షల్లో పాల్గొన్నారు. ధృవపత్రాలు సక్రమంగా లేకపోవడంతో 102 మంది ఆరంభంలోనే వెనుదిరిగారు. చివరికి 578 మంది అభ్యర్థులకు పలు అంశాల్లో పరీక్షలు నిర్వహించగా 362 మంది ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణత పొందారు. ఎస్పీ సతీశ్ కుమార్, అదనపు ఎస్పీలు పర్యవేక్షించారు.
Similar News
News February 12, 2025
కొల్లిపరలో భారీ కొండ చిలువ

కొల్లిపర మండలం పిడపర్తిపాలెంలో బుధవారం భారీ కొండచిలువ కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు ఆదాము ఉదయం పనుల నిమిత్తం పొలానికి వెళ్లాడు. ఈ సమయంలో నిమ్మతోటలో భారీ కొండ చిలువ కనిపించడంతో భయాందోళనకు గురయ్యాడు. ఊర్లోకి వెళ్లి గ్రామస్థులను తీసుకువచ్చి కొండ చిలువను పట్టుకొని కృష్ణానది పరీవాహక ప్రాంతంలో వదిలారు. తరచూ గ్రామంలో, పొలాల్లో కొండ చిలువలు కనిపిస్తుండటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
News February 12, 2025
గుంటూరులో నేటి చికెన్ ధరలు ఇవే!

గుంటూరు జిల్లాలో పొరుగు జిల్లాలతో పోల్చుకుంటే చికెన్ కి డిమాండ్ ఎక్కువగానే ఉంది. జిల్లాలో నేడు స్కిన్ లెస్ రూ.246, స్కిన్ రూ.236గా ఉంది. సాధారణ రోజుల్లో గుంటూరుకి ఇతర జిల్లాలకు 5, 10 రూపాయలు తేడా ఉండేది. కానీ ఇప్పుడు ఇతర జిల్లాల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒకేసారి గుంటూరుకి ఇతర జిల్లాలకు రూ.20 నుంచి రూ.25 వ్యత్యాసం కనిపిస్తోంది.
News February 12, 2025
JEEలో సత్తాచాటిన గుంటూరు అమ్మాయి

JEE మెయిన్స్ ఫలితాల్లో గుంటూరుకు చెందిన గుత్తికొండ సాయిమనోజ్ఞ సత్తా చాటింది. తొలి విడత పేపర్-1 ఫలితాల్లో 100% మార్కులతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాలికల విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. నగరానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ కిషోర్ చౌదరి, ప్రైవేట్ ఆసుపత్రిలో HODగా పనిచేస్తున్న పద్మజ దంపతుల కుమార్తెనే సాయిమనోజ్ఞ. ఇష్టపడి విద్యను అభ్యసించడం కారణంగా 100% మార్కులు సాధించానని హర్షం వ్యక్తం చేస్తుంది.