News December 18, 2024
గుంటూరు: నాడు అన్న.. నేడు తమ్ముడు హత్య

గుంటూరులో మంగళవారం స్నేహితుల వివాదంలో ఒకరి మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. తెనాలికి చెందిన దీపక్(25), GNTకు చెందిన కిరణ్ స్నేహితులు. గతంలో కిరణ్ వద్ద దీపక్ రూ.50 వేలు తీసుకున్నాడు. డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో వివాదం నెలకొంది. మంగళవారం కిరణ్ పార్టీ ఇస్తున్నానని చెప్పి దీపక్‌ను పిలిచాడు. కిరణ్ అతని స్నేహితులు దీపక్‌ను కొట్టి చంపారు. కాగా గతంలో దీపక్ అన్న హత్యకు గురికావడం గమనార్హం.
Similar News
News December 14, 2025
GNT: సీఎం రాక ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

CM చంద్రబాబు ఈ నెల 16న మంగళగిరిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, ఎస్పీవకుల్ జిందాల్ ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా పోలీస్ నియామకం చేపట్టి, ఎంపికైన 6,100 అభ్యర్థులకు మంగళగిరి 6వ బెటాలియన్ పెరేడ్ గ్రౌండ్లో నియామక పత్రాలు అందించనున్నారు. సీఎం స్వయంగా పాల్గొని అభ్యర్థులకు నియామక పత్రాలు అందించనున్నారు.
News December 14, 2025
PGRS సేవలు వినియోగించుకోండి: కలెక్టర్

గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. https://Meekosam.ap.gov.in వెబ్ సైట్ ద్వారా, నేరుగా అయినా అర్జీలు సమర్పించవచ్చని చెప్పారు. 1100 టోల్ ఫ్రీకి డయల్ చేసి అర్జీల స్థితినితెలుసుకోవచ్చని చెప్పారు. అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
News December 14, 2025
GNT: వరుసగా మూడోసారి మన జిల్లా టాప్

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మొత్తం 431 లోక్ అదాలత్ బెంచ్‌లను ఏర్పాటు చేసి 3,04,212 కేసులను పరిష్కరించామని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ తెలిపారు. ఇందులో 5,985 సివిల్, 2,75,567 క్రిమినల్ కేసులు ఉన్నాయి. కాగా సివిల్ కేసుల పరిష్కారంలో 23,466 కేసులతో గుంటూరు జిల్లా వరుసగా మూడోసారి ప్రథమ స్థానంలో నిలిచింది.


