News September 30, 2024
గుంటూరు: నేటి నుంచి ఇళ్లకు ఉచిత ఇసుక

గృహాలు నిర్మించుకునే వారికి సోమవారం నుంచి గంగా ఇసుక అందుబాటులో ఉండనున్నట్లు కలెక్టర్ లక్ష్మీ తెలిపారు. పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకొని నగదు చెల్లించి అప్లై చేసుకున్న వారికి ఉచితంగా ఇసుక ఇస్తారని చెప్పారు. సొంత వాహనం కలిగిన వారికి స్లాట్ ఇస్తున్నామని పేర్కొన్నారు. వాహనం లేని వారికి ప్రభుత్వమే సమకూరుస్తుందని, వినియోగదారులు రవాణా చార్జీలు చెల్లించి తీసుకెళ్లాల్సి ఉంటుందన్నారు.
Similar News
News July 11, 2025
GNT: చంద్రబాబు, లోకేశ్‌పై అంబటి ట్వీట్

వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కి చురకలంటించారు. ‘తల్లికి వందనం’ లోకేశ్ ఆలోచన. ‘ఉచిత విద్యుత్’ బాబు ఆలోచన అని చెప్తూ అమాయకపు ప్రజల్లారా నమ్మండి.!’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా అంబటి మెసేజ్‌పై టీడీపీ, వైసీపీ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పరస్పరం మాటల యుద్దం జరుగుతుంది.
News July 11, 2025
GNT: రాష్ట్రీయ బాల పురస్కార్‌కు ప్రతిభావంతులకు అవకాశం

విభిన్న ప్రతిభను ప్రోత్సహించేందుకు గుంటూరు జిల్లాలోని 18ఏళ్ల లోపు విద్యార్థుల నుంచి రాష్ట్రీయ బాల పురస్కార్‌కు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కళలు, క్రీడలు, పర్యావరణం, సామాజిక సేవ, తదితర రంగాల్లో సామర్థ్యం చూపిన పిల్లలు జులై 31లోగా https://awards.gov.inలో అప్లై చేయాలని జిల్లా శిశు సంక్షేమ అధికారి ప్రసూన తెలిపారు. కేంద్రం నిర్వహించే ఈ అవార్డు ప్రతిభకు గుర్తింపు కల్పించనుందన్నారు.
News July 11, 2025
మంగళగిరి: ముత్యాల పందిరి వాహన ఉత్సవంలో అపశృతి

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ముత్యాల పందిరి వాహనం ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. ధ్వజస్తంభం వద్ద ఊరేగింపుగా బయలుదేరిన క్రమంలో వాహనం ఒక్కసారిగా ఒరిగిపోయింది. దేవస్థాన సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి, ఉత్సవ విగ్రహాలు కింద పడకుండా కాపాడారు. ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.