News October 4, 2024

గుంటూరు: నేడే వైసీపీ జిల్లా అధ్యక్షుల బాధ్యతల స్వీకరణ

image

వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, గుంటూరు, నర్సరావుపేట లోక్‌సభ నియోజకవర్గాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు బాధ్యతలు స్వీకరిస్తారని పార్టీ నాయకులు తెలిపారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే పదవీ ప్రమాణస్వీకార సభలో రాజ్యసభ సభ్యులు అయోధ్యరామిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరు అవుతారని చెప్పారు.

Similar News

News October 16, 2025

గుంటూరు జిల్లాలో 173 న్యూసెన్స్ కేసులు: ఎస్పీ

image

గుంటూరు జిల్లా వ్యాప్తంగా నైట్ టైమ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నైట్ టైమ్‌లో అనవసరంగా తిరుగుతున్న 181 మందిపై 173 న్యూసెన్స్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఓపెన్ డ్రింకింగ్, రోడ్లపై అనవసరంగా తిరుగుతూ, ప్రజల భద్రతకు భంగం కలిగించే వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.

News October 16, 2025

పెట్టుబడి వ్యయం తగ్గించేలా రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

వ్యవసాయ, ఉద్యాన, పాడి పరిశ్రమ రంగాల్లో పెట్టుబడి వ్యయం తగ్గించి దిగుబడులు ద్వారా అధిక ఆదాయం సాధించేందుకు రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. గురువారం కలక్టరేట్‌లో అధికారులతో సమీక్ష చేశారు. సాగు ప్రోత్సాహానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, రాయితీల వివరాలను రైతులకు వివరించాలని చెప్పారు. నిర్దేశిత లక్ష్యాల మేరకు అభివృద్ధి సాధించేలా కృషి చేయాలన్నారు.

News October 16, 2025

అమరావతి: 40 ఎకరాల భూమి ఇచ్చేందుకు రైతుల అంగీకారం

image

అమరావతి భూ సమీకరణకు రైతులు స్వచ్ఛందంగా 40.25 ఎకరాల భూమిని ఇచ్చేందుకు ముందుకొచ్చారు. కమిషనర్ కె. కన్నబాబు చర్చలు ఫలించాయి. ఉండవల్లిలో అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు, కొండవీటి వాగు, ఇతర రోడ్ల నిర్మాణ పనుల కోసం 22 మంది రైతులు 12 ఎకరాల భూమిని ల్యాండ్‌ పూలింగ్‌ కింద ఇచ్చారు. పెనుమాకలో 14 మంది రైతులు 28.25 ఎకరాల భూమి ఇచ్చేందుకు అంగీకరించారు.