News March 29, 2025
గుంటూరు: నైట్ ఫుడ్ కోర్ట్ విషయంలో చర్చ.!

కరోనా ముందు వరకు నైట్ ఫుడ్ కోర్ట్ హిందూ కళాశాల సెంటర్‌లో నడిచింది. మార్కెట్‌కు సరుకు తెచ్చే రైతులు, ఆసుపత్రులకు, బస్టాండ్, రైల్వే స్టేషన్‌కు దగ్గరగా ఉండటంతో బాగా నడిచిందని, ఇప్పుడు వీటన్నిటికీ దూరంగా బ్రాడీపేట, అరండల్ పేటలో ఫుడ్ కోర్టును నిర్వహిస్తే అంత ప్రయోజనకరంగా ఉండదని ప్రజలు చర్చించుకుంటున్నారు. మున్సిపల్ అధికారులు మరోసారి పునరాలోచించి హిందూ కళాశాల రోడ్డులోనే ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు.
Similar News
News April 3, 2025
ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కుమార్తె ఫోన్ హ్యాక్

ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కుమార్తె ప్రత్తిపాటి స్వాతి ఫోను బుధవారం హ్యాక్ అయ్యింది. ఈ మేరకు డబ్బులు కావాలంటూ చిలకలూరిపేటలోని పలువురు ప్రముఖులకు వాట్సప్ సందేశాలను సైబర్ నేరగాళ్లు పంపించారన్నారు. నేరగాళ్లు ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు అడిగితే స్పందించవద్దని టీడీపీ సోషల్ మీడియా గ్రూపులలో సిబ్బంది మెసేజ్ పెట్టింది.
News April 3, 2025
ఉదయం 8 తర్వాత హెవీ వెహికల్స్‌కు ప్రవేశం లేదు: ట్రాఫిక్ డీఎస్పీ

ఉదయం 8 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు హెవీ వెహికల్స్ గుంటూరులోకి ప్రవేశించడానికి అనుమతి లేదని ట్రాఫిక్ డీఎస్పీ రమేశ్ స్పష్టం చేశారు. బుధవారం డీఎస్పీ తన కార్యాలయంలో నగరంలోని హెవీ వెహికల్స్ యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. రాత్రి 10:00 నుంచి ఉదయం 8 గంటల లోపు మాత్రమే హెవీ వెహికల్స్ నగరంలోకి ప్రవేశం ఉందన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సీఐ సింగయ్య పాల్గొన్నారు.
News April 3, 2025
వసతీ గృహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: కలెక్టర్

ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, వసతీ గృహాల్లో బాల, బాలికలు, మహిళల పై నేరాల నియంత్రణ కోసం ముందస్తుగా భద్రతా చర్యలు చేపట్టాలని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలోని డీఆర్సీ మీటింగ్ హాలులో బుధవారం ఎస్పీ సతీశ్ కుమార్‌తో కలిసి నేరాల నియంత్రణ పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. వసతీ గృహాల స్వాగత ద్వారంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.