News May 11, 2024
గుంటూరు: పంపిణీకి ఈవీఎంలు సిద్ధం

ఈనెల 13వ తేదీన నిర్వహించిన పోలింగ్‌కు సంబంధించిన ఈవీఎంలు, వివి ప్యాట్లను అధికారులు పంపిణీకి సిద్ధం చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంకు ఈవీఎం, వివి ప్యాడ్ ఇతర సామాగ్రిని ఒక ప్రత్యేక బ్యాగులో ఏర్పాటు చేశారు. గుంటూరు లాడ్జి సెంటర్‌లోని పంపిణీ కేంద్రాలను గుంటూరు పశ్చిమ రిటర్నింగ్ అధికారిని రాజ్యలక్ష్మి శనివారం పరిశీలించారు. పశ్చిమ పరిధిలోని 292 పోలింగ్ కేంద్రాలకు ఆదివారం ఈవీఎంల పంపిణీ చేస్తామన్నారు.
Similar News
News December 12, 2025
పోలీస్ సిబ్బంది వినతుల పరిష్కారానికి ప్రాధాన్యత: SP

SP వకుల్ జిందాల్ ప్రతి శుక్రవారం నిర్వహించే పోలీస్ స్టాఫ్ గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది నుంచి నేరుగా వినతులను స్వీకరించిన SP, సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. శాఖాపరమైన కేసుల్లో విచారణ అనంతరం సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామన్నారు. నిజాయితీతో ప్రజలకు సేవ చేయాలని సూచిస్తూ, సిబ్బందికి అనువైన వాతావరణం కల్పనకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
News December 12, 2025
విద్యార్థుల్లో నైపుణ్యాల మెరుగుదల కోసం కృషి చేయాలి: DEO

విద్యార్థుల్లో నైపుణ్యాల మెరుగుదల కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని గుంటూరు DEO సలీం బాషా సూచించారు. స్తంభాలగరువులోని చేబ్రోలు మహాలక్ష్మీ పుల్లయ్య ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) పురోగతిని DEO పరిశీలించి, విద్యార్థుల ప్రతిభను పరీక్షించారు. కార్యక్రమంలో MEO ఖుద్దూస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
News December 12, 2025
ప్రభుత్వ సేవలు పారదర్శకంగా ప్రజలకు అందాలి: విజయానంద్

ప్రభుత్వ సేవలు పారదర్శకంగా ప్రజలకు అందాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్నారు. పెన్షన్లు, రేషన్ పంపిణీ, వైద్య సేవలు, ధాన్యం సేకరణపై గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ప్రజల సంతృప్తి స్థాయి పెంచేలా అధికారులు పనిచేయాలని చెప్పారు. లబ్ధిదారుల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా, జేసీ అశితోష్ శ్రీవాత్సవ్ పాల్గొన్నారు.


